నేను మీ తప్పిపోయిన కొడుకును.. యూపీలో కొత్త రకం దోపిడీ!
యూపీ అంటేనే నేరాలు, ఘోరాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రకమైన దోపిడీ జరుగుతుందో ఊమించలేని పరిస్థితులు.
యూపీ అంటేనే నేరాలు, ఘోరాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రకమైన దోపిడీ జరుగుతుందో ఊమించలేని పరిస్థితులు. ఎక్కడ ఎవరు మర్డర్ అవుతారో కూడా తెలియని దుస్థితి. మరోవైపు.. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దోపిడీదారులు, దొంగలు కొత్తకొత్తగా ఆలోచిస్తున్నారు. కొత్త రకమైన దోపిడీలకు పాల్పడుతున్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా తాము అనుకున్న ప్లాన్‌ను అమలు చేస్తూ కోట్లాది రూపాయల డబ్బును కొల్లగొడుతున్నారు.
సరిగా ఇలాంటి వినూత్న ఆలోచనకు తెరతీశాడు ఓ దొంగ. చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకును అంటూ ఏదో ఒక ఇంటికి చేరుకుంటాడు. దాంతో ఆ కుటుంబసభ్యులు కూడా 30 ఏళ్ల తరువాత తమ కొడుకు తమ వద్దకు వచ్చాడంటూ చేరదీయడం ప్రారంభిస్తారు. ఇలా ఓ ఫ్యామిలీకి దగ్గరైన ఈ దొంగను ఓ కుటుంబం ఎంతగానో ప్రేమగా చూసుకుంది. భవిష్యత్తులో ఈ కొడుకే తమ బాగోగులు చూసుకుంటాడని ఎంతగానో ఆ దంపతులు ఆశపడ్డారు. కానీ.. కొన్ని రోజుల్లో అతని ప్రవర్తనలో మార్పు రావడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఇంద్రరాజ్ అలియాస్ రాజు అలియాస్ భీమ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు. తాను 1993లో ఏడేళ్ల వయసులో కిడ్నాప్‌నకు గురయ్యాయని నమ్మించాడు. తనను తన కుటుంబసభ్యుల వద్దకు చేర్చాలని వేడుకున్నాడు. దీంతో వారం రోజులపాటు అతడికి ఆశ్రయం ఇచ్చి.. అతను చెప్పిన ఆధారాల ప్రకారం ఘాజియాబాద్‌లోని ఓ కుటుంబాన్ని ఆశ్రయించారు. వారు తమ కుమారుడు తప్పిపోవడంతో ఇంద్రరాజ్‌నే కొడుకుగా భావించారు. దీంతో వారు ఇంటికి తీసుకెళ్లారు. అయితే.. ఈ వ్యక్తి తరచూ ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులను అడగడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా అనుమానాస్పదంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. దీంతో ఆ కుటుంబసభ్యులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఆ ఇంద్రరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఆ వెంటనే డీఎన్ఏ టెస్టులు చేపించారు. ఈ పరీక్షలో ఇంద్రరాజ్ ఆ దంపతుల కొడుకు కాదని వెల్లడైంది. దీంతో వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంక్వయిరీ చేయగా.. అతడు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా నిర్ధారణ అయింది. దొంగతనాలకు అలవాటు పడిన ఇంద్రరాజ్‌ను అతని కుటుంబసభ్యులు 2005లో ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. దాంతో అతను అప్పటి నుంచి తన పేరు మార్చుకొని బయట తిరుగుతున్నాడు.
వారిని వీరిని తన కొడుకు అని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు. కొడుకునంటూ కొన్ని రోజులు ఆ ఇంట్లో తిష్టవేయడం ఆ తరువాత ఆ ఇంట్లో విలువైన వస్తువులను దోచుకోవడం అతనికి అలవాటుగా మారింది. అలా ఇప్పటివరకు పంజాబ్, రాజస్థాన్, హరియాణాలోని హిసార్, సిర్సాలోని తొమ్మి కుటుంబాలను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2021లోనూ ఇంద్రరాజ్‌పై పలు కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.