అక్కడ 'బూమ్ బూమ్' .. ఇక్కడ 'బిర్యానీ'

ఏది ఎలా ఉన్నా కొత్త బీర్ల పేర్లు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Update: 2024-06-09 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో 'బూమ్ బూమ్' బీరు ఎంత హల్ చల్ చేసిందో అందరికీ తెలిసిందే. కొరియో గ్రాఫర్ రాకేశ్ మాస్టర్ మరణం అనంతరం అది మరింత ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త బ్రాండ్ బీర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అక్కడ బూమ్ బూమ్ పేరుతో ఉన్న బీరును తెలంగాణలో బిర్యానీ పేరుతో ప్రవేశ పెట్టినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

మద్యం ప్రియులకు ఎప్పటి నుండో అలవాటైన పాత బ్రాండ్లను ఉద్దేశపూర్వకంగానే మద్యం కృత్రిమ కొరత సృష్టించారని ఓవైపు ఆరోపణలు వస్తుండగా అందుకోసమే కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నది. తెలంగాణలో కొత్త బీర్ల కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో ఒక మాజీ ఐఎఎస్ కీలకపాత్ర పోషించినట్లు చెబుతున్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో ఓ విభాగానికి సెక్రటరీగా ఉంటూ రిటైర్‌ అయిన ఓ ఐఏఎస్‌ అధికారి.. ఇటీవల కొత్త ప్రభుత్వానికి మరింత దగ్గరై మద్యం పాలసీలో చక్రం తిప్పుతున్నాడని తెలుస్తుంది. ఓ డిస్టిలరీ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ కొన్ని మద్యం కంపెనీలకు ముడిసరుకు ఇచ్చే వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. తెలంగాణలో వచ్చే కొత్త బ్రాండ్ల మద్యం నాణ్యత, అమ్మకాలపై మద్యం వ్యాపారుల్లో సంశయం నెలకొన్నది. ఇటీవల బేవరేజెస్‌ కార్పొరేషన్‌ కొత్తగా ఐదు మద్యం కంపెనీల నుంచి 27 రకాల కొత్త ఉత్పత్తులకు అనుమతులు ఇచ్చింది. ఈ కొత్త ఉత్పత్తులు మద్యం ప్రియులకు నచ్చుతాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా కొత్త బీర్ల పేర్లు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Tags:    

Similar News