ఏపీ లో ఇంకో కొత్త పార్టీ.. ముహూర్తం ఖ‌రారు.. ఎవ‌రి కోసమంటే..?

ఈ ప‌రంప‌ర‌లోనే తాజాగా మ‌రో పార్టీ కూడా ఏపీ లో పురుడు పోసుకోనుంది.

Update: 2023-07-31 08:12 GMT

ఏపీ లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ.. కొత్త పార్టీల ఏర్పాటు ప్ర‌క్రియ పుంజుకుంటోంది. నిజానికి ఇలాంటి పార్టీలు.. కేవ‌లం ఎన్నిక‌ల కోస‌మే పుడ‌తాయ‌నే విష‌యం చాలా మందికి తెలిసిందే. ఆయా వ‌ర్గాల ఓటు బ్యాంకు ను చీల్చ‌డం.. త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న పార్టీల‌కు చెక్ పెట్టాల‌నే ల‌క్ష్యం తోనే పార్టీలు పుట్ట‌గొ డుగుల్లా తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఇలాంటివాటికి ప్ర‌జ‌ల్లో పెద్ద‌గా ప్రాధాన్యం లేక‌పోయినా.. రాజ‌కీయంగా మాత్రం చ‌ర్చ జ‌రుగుతుంది.

ఇటీవ‌ల జ‌న‌సేన మాజీ నాయ‌కుడు రామ‌చంద్ర‌యాద‌వ్.. భార‌త చైత‌న్య యువజ‌న పార్టీ(బీసీవైపీ) అనే పార్టీని ప్రారంభించారు. కానీ, ఈయ‌నే 2019 ఎన్నిక‌ల‌ కు ముందు కూడా.. ఇలానే పార్టీపెట్టి.. కొంత హ‌డావుడి చేశారు. ఇక‌, ఇప్పుడు కూడా ఇలాంటి హ‌డావుడి కోసం.. పార్టీని ప్రారంభించారు. అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన‌ట్టు కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఇక‌,.. ఈ ప‌రంప‌ర‌లోనే తాజాగా మ‌రో పార్టీ కూడా ఏపీ లో పురుడు పోసుకోనుంది. అదే.. 'పూలే, అంబేద్క‌ర్ రాజ్యాంగ స‌మితి'(పీఏఆర్ ఎస్‌పీ). దీని ని ఈ ఏడాది అక్టోబ‌రు లో ప్రారంభించ‌నున్న‌ట్టు స‌మితి క‌న్వీన‌ర్ క‌టిక‌ల శివ భాగ్యారావు తెలిపారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద రిజిస్ట్రేష‌న్ చేసుకునే ప‌ని లో ఉన్నామ‌ని తెలిపారు. ఇదిలావుంటే.. రాష్ట్రం లో ఇప్ప‌టికే జై భీం పార్టీ అని ఒక‌టి ఉంది.

ఇది కూడా.. చిన్నాచిత‌కా పార్టీల జాబితా లోనే ఉంది. ఇది కాకుండా.. అమ‌రావ‌తి రాజ‌ధాని లోనూ రైతు సంక్షేమ పార్టీ అని ఒక దానిని స్థాపించారు. అయితే.. దీనికి ఇంకా ఎన్నిక‌ల సంఘం గుర్తింపు రావాల్సి ఉంది. మ‌రోవైపు.. ప్ర‌జాశాంతి పార్టీ, రాయ‌ల‌సీమ‌ లోనూ.. స్థానిక పార్టీలు రెండు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. వీటి ల‌క్ష్యం కేవ‌లం ఓట్లు చీల్చ‌డం లేదా.. బ‌ల‌మైన పార్టీల‌ ను త‌మ‌వైపు తిప్పుకొని చేతులు క‌ల‌ప‌డం ద్వారా ఆర్థికంగా బ‌లోపేతం కావ‌డ‌మే భావ‌న ప్ర‌జ‌ల్లో ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News