సికింద్రాబాద్-విశాఖ మధ్య మరో వందేభారత్ రైలు

దీంతో వందేభారత్ రైళ్లు దేశ గమనంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

Update: 2024-03-12 06:08 GMT

దేశంలో ప్రయాణ రంగంలో వినూత్న మార్పులు వస్తున్నాయి. వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టి ప్రయాణంలో దూరభారం తగ్గిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రైళ్లు ప్రవేశపెట్టి ప్రజలకు సేవలు దగ్గర చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే వందల రైళ్లు పరుగులు పెడుతున్నాయి. సమయం ఆదా చేస్తున్నాయి. వేగంగా పరుగులు పెడుతూ ప్రజలను సురక్షితంగా గమ్యం చేరుస్తున్నాయి. దీంతో వందేభారత్ రైళ్లు దేశ గమనంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.

దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో మరో రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు వచ్చాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఓ రైలు నడుస్తుండగా మంగళవారం మరో వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లు కలుపుతూ కలబురగి-బెంగుళూరు మార్గంలో కొత్త ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని ప్రారంభించారు. దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య 50 దాటడం విశేషం.

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో రూ.85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభోత్సవాలు చేశారు. వాటిని జాతికి అంకితం చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు, 11 గూ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను ప్రధాని ప్రారంభించారు. కొళ్లం-తిరుపతి మెయిల్ ఎక్స్ ప్రెస్, పలు మార్గాల్లో గేజ్ మార్పిడి, బైపాస్ లైన్లు మొదలుపెట్టారు.

సికింద్రాబాద్- విశాఖ, కలబురగి-బెంగుళూరు, లఖ్ వూ- డెహ్రాడూన్, పట్నా-లఖ్ నవూ, న్యూ జల్ పాయ్ గుడి- పట్నా, పూరి-విశాఖపట్నం, రాంచీ-వారణాసి, ఖజురహో-ఢిల్లీ, అహ్మదాబాద్- ముంబయి, మైసూరు- చెన్నై మార్గాల్లో పది వందేభారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించారు. దేశంలో వందేభారత్ రైళ్ల సంఖ్య పెరుగుతుండటంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారుతోంది.

ప్రయాణికులు తొందరగా గమ్య స్థానం చేరడానికి ఇవి దోహదపడుతున్నాయి. ఢిల్లీ లాంటి నగరాల్లో వీటి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు వీటిని విస్తరిస్తున్నారు. దీంతో ప్రయాణ భారం లేకుండా చేసేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే వందే భారత్ రైళ్ల సంఖ్యను నానాటికి పెంచుతోంది. అధునాతన సదుపాయాలతో వేగంగా వెళ్లే రైళ్లు మరిన్ని ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News