మేనకోడలి వేడుక కోసం 3 మేనమామలు.. ఎంత భారీ అంటే అవాక్కే!

నిజానికి.. మన చుట్టూ ఉండే ఎంతో పాజిటివిటీని.. అక్కడక్కడా ఉండే నెగిటివి కమ్మేయటంతో మంచి చాలామందికి కనిపించని పరిస్థితి.

Update: 2024-02-29 05:36 GMT

మారుతున్న కాలానికి తగ్గట్లుగా బంధాల మధ్య చిక్కదనం తగ్గిపోతుందని.. మనుషుల మధ్య అనుబంధాలు అన్ని డబ్బు లెక్కల్లోకి వెళ్లిపోతున్నాయంటూ ఆవేదన చెందే ఎంతో మందికి ఈ ఉదంతం గురించి విన్నంతనే ఉపశమనం కలగటంతోపాటు.. విస్మయానికి గురయ్యే అవకాశం ఎక్కువే. నిజానికి.. మన చుట్టూ ఉండే ఎంతో పాజిటివిటీని.. అక్కడక్కడా ఉండే నెగిటివి కమ్మేయటంతో మంచి చాలామందికి కనిపించని పరిస్థితి.

గతంతో పోలిస్తే వర్తమానంలో బంధాల మధ్య చిక్కదనం లేదన్నది నిజమే అయినా.. అదేమీ ఆవిరి కాలేదన్న భావన కొన్ని ఉదంతాల్ని చూస్తే అర్థమవుతాయి. ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్యే అనుబంధాలు అంతంత మాత్రంగా ఉండే ఈ రోజుల్లో.. మేనకోడలి కోసం ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు మేనమామలు చేసిన వేడుక ఇప్పుడు వార్తాంశంగా మారింది. భారీ అంటే అలాంటి ఇలాంటి భారీ కాదు.. విన్నంతనే వావ్ అనేలా నిర్వహించిన వేడుక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తమిళనాడులోని దిండుక్కల్ జిల్లా కొడైకెనాల్ కేసీ పట్టి గ్రామానికి చెందిన ఐయ్యప్పన్ ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన జిల్లా టింబర్ మర్చంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన కుమార్తె దీప అక్షు ఇటీవల పుష్పవతి (మెచ్యూర్) అయ్యారు. దీనికి సంబంధించిన వేడుకను ఘనంగా నిర్వహించారు. అయితే.. ఈ వేడుకలో భాగంగా ఆ బాలికకు చెందిన ముగ్గురు మేనమామలు.. ఊరంతా ఆశ్చర్యపోయేలా సారెను అందించారు.

పుష్పవతి వేడుక వేళ.. మేనమామలు బట్టలు పెట్టటం సంప్రదాయం. దీన్ని ఒక స్థాయిలో చూపించాలని భావించిన ముగ్గురు మేనమామలు ఉమ్మడిగా మాట్లాడుకొని.. పండ్లు.. ఫలహారాలు.. పూలు.. నగలు.. ఇలా 300 రకాల సారెను మూడు వందల మంది మహిళలు తమ తలపై పెట్టుకొని మేళ తాళాలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఇంత భారీగా వేడుక నిర్వహించిన వైనం స్థానిక ప్రజల్ని ఆశ్చర్యపోయేలా చేసింది.

అంతేకాదు.. భారీ ఊరేగింపును నిర్వహించారు. ఈ ఊరేగింపులో మేనకోడల్ని ప్రత్యేక రథంలో ఉంచి.. ఊరేగించిన వైనం కొత్త ట్రెండ్ కు తెర తీసేలా ఉందని చెప్పాలి. ఒకప్పుడు ఎవరికి వారు తమ స్థాయిలో నిర్వహించే పుష్పవతి ఫంక్షన్ ను ఈ మధ్యన ఆడంబరంగా చేయట్లేదు. అందుకు భిన్నంగా ఈ కార్యక్రమం చేయటం ఒక ఎత్తు అయితే.. మేనకోడలి కోసం ముగ్గురు మేనమామలు చేసిన వేడుక ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అంతేకాదు.. ఈ వేడుకకు వచ్చిన అతిధులకు పెద్ద ఎత్తున వంటకాలతో విందు భోజనం పెట్టారు.


Full View


Tags:    

Similar News