మార్స్ మిషన్‌కు నాసా సరికొత్త ప్లాన్.. 'నైట్‌హాక్' స్పెషాలిటీలివే !

అక్కడి రహస్యాలు తెలుసుకోవడానికి నాసా ఒక కొత్త మిషన్ రెడీ చేస్తోంది. దాని పేరు 'నైట్‌హాక్ మిషన్'. దీనికోసం నాసా ఒక పెద్ద డ్రోన్‌ను పంపడానికి ఏర్పాట్లు చేస్తోంది.;

Update: 2025-04-08 19:30 GMT
Nighthawk Mission to Uncover Secrets of Mars

అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా.. మనోళ్ల చూపు అంతా ఇప్పుడు అంగారకుడి మీదే ఉంది. అక్కడి రహస్యాలు తెలుసుకోవడానికి నాసా ఒక కొత్త మిషన్ రెడీ చేస్తోంది. దాని పేరు 'నైట్‌హాక్ మిషన్'. దీనికోసం నాసా ఒక పెద్ద డ్రోన్‌ను పంపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ డ్రోన్ చూడటానికి ఎస్‌యూవీ కారు సైజులో ఉంటుందట. అంతేకాదు, ఇది లేటెస్ట్ టెక్నాలజీతో నిండిపోయి ఉంటుందని చెప్తున్నారు. అంగారక గ్రహం గాలిలో ఎగరడానికి ఈ డ్రోన్‌కు ఆరు రోటర్లు, ఆరు బ్లేడ్‌లు ఉంటాయి. నైట్‌హాక్ మిషన్ ముఖ్యంగా అంగారకుడి తూర్పు వైపున ఉన్న నోక్టిస్ లాబిరింథస్ అనే ఏరియాని వెతకడానికి ఈ మార్స్ చాపర్‌ను వాడుతుంది. ఈ మిషన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే.. అంగారకుడి మీద జీవం ఉండే అవకాశం ఉందా అని తెలిపే బయోమార్కర్లు ఏమైనా ఉన్నాయేమో చూడటం. ఈ ప్రాంతం ఒకప్పుడు పెద్ద అగ్నిపర్వతం అని కూడా అనుకుంటున్నారు.

ఈ మిషన్ ద్వారా మూడు రకాల ముఖ్యమైన పరికరాలను (పేలోడ్స్) పంపుతున్నారు. మొదటిది 'ఓమ్ని డైరెక్షనల్ కలర్ కెమెరా సిస్టమ్' (OCCAM). దీనికి ఎనిమిది కెమెరాలు ఉంటాయి. అంగారకుడి మీద జరిగే ప్రతి కదలికను ఇది ఫోటోలు తీసి పంపిస్తుంది. రెండోది 'NIRAC స్పెక్ట్రోమీటర్', 'కాంటాక్స్ట్ కెమెరా'. మూడోది 'పులీ మార్స్ వాటర్ స్నూపర్' (PMWS), 'న్యూట్రాన్ డిటెక్టర్'. ఇది అంగారకుడి మీద నీళ్లు ఉన్నాయా లేవా అని కనిపెడుతుంది. ఈ డ్రోన్ అంగారకుడి మీద సగటు ఎత్తు కంటే దాదాపు 4,920 అడుగుల ఎత్తు వరకు ఎగురుతుంది. ఒకసారి ఎగిరితే దాదాపు 1.86 మైళ్ల దూరం వెళ్తుంది.

సెటి ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పాస్కల్ లీ అనే శాస్త్రవేత్తల టీమ్ ఒక రిపోర్ట్‌లో ఏం రాసిందంటే.. "నైట్‌హాక్ అనేది నాసా మార్స్ చాపర్ మిషన్ కోసం ఒక కొత్త ఆలోచన. తూర్పు నోక్టిస్ లాబిరింథస్‌లోని పురాతన అగ్నిపర్వతం, అక్కడి లావా, లోయలు, గడ్డకట్టిన మంచు జాడలు, నీళ్లు ఉన్నాయా, ఏమైనా ఖనిజాలు దాగి ఉన్నాయా, జీవం ఉండే ఛాన్స్ ఉందా, మనుషులు దిగడానికి వీలుందా అనే విషయాల గురించి కొత్త ఇన్ఫర్మేషన్ సేకరించడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం."

నాసా పంపే ఈ డ్రోన్ అంగారకుడి మీద కనీసం 240 రోజుల వరకు తిరుగుతూ రకరకాల ఇన్ఫర్మేషన్ శాస్త్రవేత్తలకు పంపిస్తుందట. ఉదాహరణకు అక్కడ నీళ్లు ఎలా ఉన్నాయి, నేల ఎలా ఉంది అనే విషయాలన్నీ తెలుస్తాయి. కాలిఫోర్నియాలోని నాసా అమెస్ రీసెర్చ్ సెంటర్ డాక్యుమెంట్స్ ప్రకారం.. ఈ నైట్‌హాక్ మిషన్ కోసం మామూలు డ్రోన్‌ను వాడలేరు. దీనికోసం చాలా హైటెక్ హెలికాప్టర్ లాంటి డ్రోన్ కావాలి.

ఈ మిషన్ కోసం పంపే డ్రోన్ సైజులో చాలా పెద్దగా ఉంటుంది. దాని పవర్ కూడా చాలా ఎక్కువ. ఈ మిషన్ మొత్తాన్ని సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసేంత కెపాసిటీ దానికి ఉంటుంది. ఈ చాపర్‌ను ఇప్పుడే తయారుచేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఇది ఇంకా తయారీ దశలోనే ఉంది. ఈ డ్రోన్ చాలా హైటెక్‌గా ఉంటుందని అంటున్నారు కానీ అది ఇంకా ఎంత స్పెషల్ ఉంటుందో అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ మిషన్ లాంచ్ చేయడానికి జరుగుతున్న ఏర్పాట్లు చూస్తుంటే.. ఇది నాసా ఇప్పటివరకు పంపిన వాటిలో చాలా స్పెషల్, హైటెక్ డ్రోన్ అని మాత్రం అర్థమవుతోంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ కాన్సెప్ట్‌ను టెక్సాస్‌లోని వుడ్‌ల్యాండ్స్‌లో జరిగిన లూనార్ అండ్ ప్లానెటరీ సైన్స్ కాన్ఫరెన్స్‌లో ప్రజెంట్ చేశారు. ఈ మిషన్ ఎప్పుడు పంపుతారు, డ్రోన్ ఇంకా ఎంత స్పెషల్ ఉంటుందో అనే విషయాలు ముందు ముందు తెలుస్తాయి.

Tags:    

Similar News