ఎవరీ నిమిష ప్రియా? మరణశిక్ష విధించేంత తప్పు ఏం చేసింది?

మరోవైపు ఆమె కుటుంబ సభ్యులు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాదరు. ఇంతకూ అసలేం జరిగిందన్న వివరాల్ని చూసినప్పుడు సినిమా కథలా కనిపించటం ఖాయం.

Update: 2025-01-01 04:56 GMT

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లటం బాగానే ఉన్నా.. ఆయా దేశాల్లోని నిబంధలకు అనువుగా తమను తాము మార్చుకునే క్రమంలో తప్పుడు మార్గాల బాట పడితే ఎలాంటి తిప్పలు ఎదురవుతాయన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు. దేశం కాని దేశంలో ఉన్నప్పుడు.. వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అందుకు భిన్నంగా స్వల్ప ప్రయోజనాల కోసం చేసే కొన్ని తప్పులు తర్వాతి కాలంలో పీకకు చిక్కుకుంటాయి. దీనికి నిదర్శనంగా కేరళకు చెందిన నిమిష ప్రియ ఉదంతాన్ని చెప్పొచ్చు. ఒక హత్య కేసులో దోషిగా నిరూపితమై.మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. త్వరలోనే ఆమెకు విధించిన శిక్ష ను అమలు చేసేందుకు ఆ దేశం సిద్ధమవుతోంది. మరోవైపు. ఆమెను రక్షించేందుకు భారత విదేశాంగ శాఖ సైతం ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆమె కుటుంబ సభ్యులు సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాదరు. ఇంతకూ అసలేం జరిగిందన్న వివరాల్ని చూసినప్పుడు సినిమా కథలా కనిపించటం ఖాయం.

కేరళకు చెందిన నిమిష ప్రియా నర్సు కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్ కు వెళ్లి అక్కడ జాబ్ లో చేరింది. 2011లో కేరళకు తిరిగి వచ్చి.. థామస్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఆ తర్వాత యెమెన్ లో ఒక క్లినిక్ తెరవాలన్న ప్లాన్ చేసింది. అయితే.. ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక వ్యక్తి.. వ్యాపార భాగస్వామితోనే సాధ్యమవుతుంది. దీంతో.. యెమెన్ కు చెందిన తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్న నిమిష - థామస్ జంట తాము అనుకున్నట్లు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు.

కొన్నాళ్ల తర్వాత తన కుమార్తెకు సంబంధించిన సంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీరంతా కేరళకు వచ్చారు. వేడుక పూర్తి కాగానే నిమిష యెమెన్ వెళ్లిపోగా.. ఆమె భర్త థామస్.. కుమార్తె కేరళలోనే ఉండిపోయారు. అయితే.. దీన్ని అదునుగా తీసుకున్న యెమెన్ దేశస్తుడు (మెహది) ఆమె నుంచి డబ్బులు లాక్కోవటంతో పాటు.. వేధింపులకు గురి చేసినట్లుగా నిమిష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంతేకాదు.. నిమిషను తన భార్యగా మెహది చెప్పుకోవటం మొదలు పెట్టి.. ఆమె పాస్ పోర్టు.. ఇతర పత్రాల్ని లాక్కొన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఒక దశలో ఆమెను తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనివ్వకుండా ఆంక్షలు విధించాడు.

ఈ నేపథ్యంలో 2016లో అతడిపై అక్కడి పోలీసులకు నిమిష పిర్యాదు చేశారు. కానీ.. వారు పట్టించుకోలేదు. అతగాడి వేధింపులను భరించలేని నిమిష.. అతడికి మత్తుమందు ఇచ్చి.. అక్కడి నుంచి పారిపోవాలని భావించింది. అయితే.. ఆమె ఇచ్చిన మత్తుమందు డోస్ ఎక్కువ కావటంతో అతను చనిపోయాడు. దీంతో అతడి డెడ్ బాడీని ఒక వాటర్ ట్యాంకులో పడేసి.. ఆమె సౌదీకి వెళ్లే ప్లాన చేసింది. ఈ క్రమంలో ఆమెను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు.

యెమెన్ దేశ నిబంధనల ప్రకారం చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లిస్తే.. నిందితులను క్షమించి వదిలేసే అవకాశం ఉంది. దీంతో ప్రియ కుటుంబం దాదాపు 40వేల డాలర్లు .. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.34.2 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. బాధితుడి కటుుంబంతో చర్చలు జరిపేందుకు భారత దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన లాయర్ అబ్దుల్ అమిర్ 20వేల డాలర్లు డిమాండ్ చేశారు. దీంతో చర్చలు మధ్యలో ఆగిపోయాయి. మరోవైపు.. 2017 నుంచి యెమెన్ జైల్లో ఉన్న నిమిషకు కొద్ది నెలల్లో మరణశిక్ష విధించేందుకు వీలుగా ఆ దేశ అధ్యక్షుడు రషీద్ అల్ అలిమి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో నిమిషను కాపాడేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని వెతుకుతున్నట్లుగా విదేశాంగ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ చెబుతున్నారు. అనుకోకుండా జరిగిన నేరానికి నిమిష ఇప్పటికే ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతోంది. ఆమె ప్రాణాల్ని కాపాడి.. కేరళకు తిరిగి వచ్చేలా జరగాలని ఆశిద్దాం.

Tags:    

Similar News