పొలం పనులు చేసుకుంటున్న మంత్రి... పిక్ వైరల్!

ఈ క్రమంలో చాలా మంది క్రికెటర్లు.. ఆట విడుపు కోసం ఫుట్ బాల్ ఆడుతూ, టెన్నీస్ చూస్తూ గడుపుతుంటారు.

Update: 2025-01-16 09:07 GMT

ఉన్నతమైన స్థానాల్లో ఉన్న చాలా మంది అప్పుడప్పుడూ తమ వృత్తికి సంబంధించిన పనులే కాకుండా ఆట విడుపుగానో, తమకు ఇష్టమైన పనులపై మక్కువతోనో ఇతర పనులు చేస్తు ఉంటుంటారు. ఈ క్రమంలో చాలా మంది క్రికెటర్లు.. ఆట విడుపు కోసం ఫుట్ బాల్ ఆడుతూ, టెన్నీస్ చూస్తూ గడుపుతుంటారు.

ఇదే సమయంలో చాలా మంది రాజకీయ నాయకులు అప్పుడప్పుడు క్రికెట్ గ్రౌండ్ లో కనిపిస్తుంటారు. ఇక మరికొంతమంది ఆటవిడుపుగా నలభీమపాకాలు తయారు చేస్తుంటారు.. విదేశాలకు విహారయాత్రలకు మరికొంతమంది వెళ్తుంటారు. ఈ క్రమంలో తాజాగా సొంతూరు వెళ్లి పొలం పనులు చేసుకుంటూ కనిపించారు మంత్రి నిమ్మల.

అవును... పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగ రోజు తీరిక దొరికిందో ఏమో కానీ.. వ్యవసాయం చేశారు! ఇందులో భాగంగా.. ఉదయాన్నే సొంతూరు అగర్తిపాలెంలోని తన పొలానికి వెళ్లి.. చేలో మందు పిచికారీ చేశారు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా స్పందించిన నిమ్మల రామానాయుడు.. తీరిక సమయంలో ఇలా పొలానికి వెళ్లి పని చేయడం నిజమైన సంతృప్తినిస్తుందని తెలిపారు. కాగా... మొదటి నుంచీ ఆయనకు పొలం పనులంటే ఇష్టమని.. కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు కూడా వ్యవసాయం చేసి వరి పండించేవారని చెబుతుంటారు.

ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ సామాన్య రైతులా పొలం పనులు చేసుకుంటూ కనిపించారు. ఇందులో భాగంగా వరి చేలో మందులు పిచికారీ చేశారు.

Tags:    

Similar News