నిర్మలమ్మ తీపి కబురు చెప్పనున్నారా?

మిగిలిన నెలలతో పోలిస్తే.. జనవరి నెల చాలా వేగంగా గడిచిపోయినట్లుగా కనిపిస్తుంటుంది.

Update: 2025-01-13 04:41 GMT

సందడి ఉంటుంది. మిగిలిన నెలలతో పోలిస్తే.. జనవరి నెల చాలా వేగంగా గడిచిపోయినట్లుగా కనిపిస్తుంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టటం.. నెల మధ్యలో వచ్చే సంక్రాంతి.. ఆ జోష్ ఒక కొలిక్కి రాగానే జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున వచ్చే సెలవుతో.. అందరూ చిల్ అవుతూ ఉంటారు. జనవరి చివరకు వచ్చేసరికి అందరి చూపు.. ఫిబ్రవరి నెలాఖరులో వచ్చే కేంద్ర బడ్జెట్ మీద చూపు పడుతుంది. దేని మీద పన్ను పోటు పెరుగుతుంది? దేని మీద తగ్గుతుంది? లాంటి అంచనాలతో పాటు.. పన్ను చెల్లింపుదారుల్లోని ప్రతి ఒక్కరు వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు విషయంలో ఏమైనా శుభవార్త వస్తుందా? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

2020-21 బడ్జెట్ సందరభంగా కొత్త పన్ను విధానం ప్రకటించిన తర్వాత.. పన్ను విధానంలో పెద్ద మార్పులు వచ్చింది లేదు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఆదాయపన్ను చెల్లింపుదారుకు ఉపశమనం కలిగే ప్రకటన కేంద్ర ఆర్థిక మంత్రి నోటి నుంచి వస్తాయన్న అంచనాలు వెలువడుతుంటాయి. అయితే.. అలాంటిదేమీ జరిగింది లేదు. ఆదాయ పన్ను మార్పు విషయంలో ఐదేళ్లు దాటిన నేపథ్యంలో.. ఈసారి పన్ను చెల్లింపుదారుకు తీపి కబురుగా మారుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

పాత పన్ను విధానంలో పన్ను స్లాబ్ లను సవరించొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతన్నారు. 2023-24 బడ్జెట్ లో ప్రభుత్వం ప్రాథమిక ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని సీనియర్ సీటిజన్ లకు రూ.3 లక్షలు.. సూపర్ సనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న అంచనాల ప్రకారం రాబోయే బడ్జెట్ లో ప్రాథమిక పన్ను మినయింపు పరిమితిని సీనియర్ సిటిజన్లకు రూ.5 లక్షలు.. సూపర్ సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షల వరకు మినహాయింపు పెంచే వీలుందని చెబుతున్నారు. అదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటను ఇచ్చినట్లు అవుతుంది. అన్నింటికి మించి సీనియర్ సిజినట్లకు మరింత మేలు చేసినట్లు అవుతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News