బీహార్ కొత్త సీఎం ఎవరో చెప్పిన పీకే !

బీహార్ సీఎం నితీష్ కుమార్ మాజీ సీఎం అవుతారని ఎన్నికల వ్యూహకర్త, బీహార్ లో జన్ సూరజ్ పేరుతో పార్టీ పెట్టిన ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు.;

Update: 2025-04-11 18:30 GMT
బీహార్ కొత్త సీఎం ఎవరో చెప్పిన పీకే !

బీహార్ సీఎం నితీష్ కుమార్ మాజీ సీఎం అవుతారని ఎన్నికల వ్యూహకర్త, బీహార్ లో జన్ సూరజ్ పేరుతో పార్టీ పెట్టిన ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ పదవీ కాలం కేవలం అయిదు నెలలు మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి గెలిచినా లేక ఇండియా కూటమిలోకి నితీష్ కుమార్ జేడీయూని చేర్చినా ఆరు నూరు అయినా నితీష్ కుమార్ సీఎం అయ్యే ప్రసక్తి లేదని అన్నారు.

నితీష్ కి సీఎం గా అధికార ఇన్నింగ్స్ ముగిసినట్లే అని తేల్చేశారు. బీహార్ లో బీజేపీతో కలసి జేడీయూ పోటీ చేస్తోందని ఎండీయే గెలిస్తే ఈసారి బీహార్ కి సీఎం అయ్యేది బీజేపీకి చెందిన సీఎం మాత్రమే అని ఆయన చెప్పారు. బీజేపీ ఈసారి చాన్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోదని ఆయన అన్నారు.

నితీష్ కుమార్ ని పక్కన పెట్టి మరీ ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ అందుకుంటుందని ఆయన అంటున్నారు. పోనీ బీజేపీ కాదు అంది కదా అని కాంగ్రెస్ ఆర్జేడీలతో నితీష్ కలసినా గతంలో జరిగినట్లుగా ఆయనకు ఇండియా కూటమి కూడా సీఎం పోస్ట్ ఇచ్చేంత సీన్ లేదని అన్నారు

మొత్తం మీద చూస్తే నితీష్ కుమార్ రాజకీయంగా చివరి ఇన్నింగ్స్ లో ఉన్నారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఒకనాడు నితీష్ కుమార్ కి దగ్గర నేస్తంగా ఉంటూ ఆయన ఎన్నికలకు వ్యూహకర్తగా పనిచేసిన వారు ప్రశాంత్ కిశోర్.

అంతే కాదు జేడీయూలో కీలక పదవులు అందుకున్న వారు. నితీష్ తో మంచి స్నేహాన్ని కొనసాగించిన పీకే తరువాత కాలంలో ఆయనతో తీవ్రంగా విభేదిస్తున్నారు. నితీష్ కుమార్ మానసికంగా శారీరకంగా బాగా అలసిపోయారు అని ఆ మధ్య హాట్ కామెంట్స్ చేసిన పీకే సమయం వచ్చినప్పుడల్లా నితీష్ రాజకీయాన్ని పట్టుకుని ఎద్దేవా చేస్తున్నారు

నితీష్ కుమార్ రెండు దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా బీహార్ కి పనిచేశారు. అవినీతి మరక అంటని నేతగా ఉన్నారు. ఆయన లాంగ్ ఇన్నింగ్స్ ని ఇప్పట్లో బీహార్ లో మరో నేత కొట్టడం అసాధ్యమని చెప్పాలి. అలాంటి నితీష్ ని దించేయాలని సహజంగానే ఇండియా కూటమి చూస్తుంది ఇక బీజేపీ మిత్రుడిగా ఉన్నా బీహార్ పీఠం మీద కమలం పార్టీ గురి పెట్టి ఉంది.

దాంతో ఆయనకు సీఎం పదవి విషయంలో సందేహాలు ఉండనే ఉన్నాయి. ఇపుడు పీకే రూపంలో మరో ప్రత్యర్ధి ఆయనకు అవతరించారు మొత్తానికి ఇవన్నీ తట్టుకుని నితీష్ బీహార్ కి 2025 చివరిలో జరిగే ఎన్నికల్లో మరోసారి సీఎం అవుతారా అన్నది చొడాల్సి ఉంది. అదే కనుక జరిగితే మాత్రం అద్భుతమే అని చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News