నితీశ్ కుమార్ రెడ్డి పెళ్లి.. సిగ్గుల మొగ్గయిన యువ ఆల్ రౌండర్
ఇక మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని నితీశ్ ను పెళ్లి ఎప్పుడు బ్రో అని అడగడం.. దీనికి యువ క్రికెటర్ తెగ సిగ్గుపడిపోవడం గమనార్హం.;
సరిగ్గా గత ఏడాది ఈ సమయానికి అతడు పెద్దగా పేరు లేని క్రికెటర్.. మీడియా వారిని అడిగి మరీ తన గురించి వార్తలు రాయించుకునే పరిస్థితి.
మరిప్పుడు టీమ్ ఇండియా టెస్టు జట్టులో పాతుకుపోయిన ఆటగాడు.. ఆస్ట్రేలియా గడ్డపైనే టెస్టు సెంచరీ కొట్టిన మొనగాడు.. టి20ల్లోనూ దుమ్మురేపిన అతడు మున్ముందు వన్డేల్లోనూ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నవాడు.
పైన చెప్పుకొన్నదంతా ఆంధ్రా యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి గురించి. గత ఏడాది ఐపీఎల్ సీజన్ నితీశ్ లైఫ్ ను మార్చేసింది. సన్ రైజర్స్ తరఫున అతడు ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్ తో టీమ్ ఇండియాలోకి పిలుపొచ్చింది. బంగ్లాదేశ్ పై టి20ల్లో అదరగొట్టిన అతడు టెస్టుల్లో ఆస్ట్రేలియాపైనా రాణించాడు. అయితే, అనూహ్యంగా గాయపడి ఇంగ్లండ్ తో టి20లు, వన్డే సిరీస్ మిస్సయ్యాడు.
ఇప్పుడు పూర్తి ఫిట్ నెస్ సాధించి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో15 బంతుల్లోనే 30 రన్స్ చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంలో కీలకంగా నిలిచాడు. వాస్తవానికి నితీశ్ చివరి వరకు క్రీజ్ లో ఉంటే సన్ రైజర్స్ 300 పరుగులు చేసేదే..
ఇక మ్యాచ్ సందర్భంగా ఓ అభిమాని నితీశ్ ను పెళ్లి ఎప్పుడు బ్రో అని అడగడం.. దీనికి యువ క్రికెటర్ తెగ సిగ్గుపడిపోవడం గమనార్హం. సంబంధిత వీడియో ప్రస్తుత నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్ లో తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, ఆదివారం మ్యాచ్ కు అభిమానులు భారీగా తరలివచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సన్ రైజర్స్ కలర్ ఆరెంజ్ తో స్టేడియం నిండిపోయింది. ఇదే సమయంలో అచ్చ తెలుగువాడైన నితీశ్ ను పలకరించి అభిమానులు పరవశం చెందాడు. పనిలో పనిగా పెళ్లి ఎప్పుడో బ్రో.. అంటూ ఆట పట్టించారు. మరొకరు.. బ్రో లవ్ మ్యారేజ్ చేసుకుంటావా? అని కూడా ఉడికించారు. కాగా, ఈ సరదా ప్రశ్నలకు నితీశ్ కూడా అదే విధంగా సమాధానాలు ఇచ్చాడు.
అరేంజ్డ్ మ్యారేజే..
నితీశ్ తనది లవ్ మ్యారేజ్ కాదని చెప్పడంతో.. అతడి రెస్పాన్స్ చూసి అభిమానులు మళ్లీ గోలగోల చేశారు. ఇక ఈ వీడియోపై నెట్టింట ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లి ప్రస్తావనతో నితీశ్ తెగ సిగ్గుపడిపోయాడని కొందరు అన్నారు. బ్రో.. హ్యాండ్సమ్‌గా ఉన్నాడని కొందరు.. ఆరేంజ్ ఆర్మీ కాబట్టి పెళ్లి కూడా ఇక్కడ అమ్మాయితోనే అని మరికొందరు చెప్పుకొచ్చారు. ఇంతగా మొహమాటపడే నితీశ్ చేసుకోబోయే అమ్మాయి నిజంగా లక్కీ అని ఇంకొందరు అన్నారు. పెళ్లి కానోళ్ల పాట్లు పగోడికి కూడా వద్దన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.