తెరవెనుక హీరో... నోయల్ టాటా ప్రస్థానం ఇదే!

రతన్ టాటా మరణానంతరం టాటా గ్రూపులో అత్యంత కీలకమైన ట్రస్ట్ లకు ఛైర్మన్ గా ఎవరిని ఎన్నుకోనున్నారనే అంశం అత్యంత కీలకంగా మారింది.

Update: 2024-10-11 14:55 GMT

రతన్ టాటా మరణానంతరం టాటా గ్రూపులో అత్యంత కీలకమైన ట్రస్ట్ లకు ఛైర్మన్ గా ఎవరిని ఎన్నుకోనున్నారనే అంశం అత్యంత కీలకంగా మారింది. టాటా గ్రూపుకు మాతృ సంస్థ అయిన టాటా సన్స్ లో ట్రస్టుల మొత్తం హోల్డింగ్ 66 శాతం అంటే.. ఇది ఎంత పెద్ద బాధ్యత అనేది అర్ధం చేసుకోవచ్చు. దీంతో... ఆ బాధ్యతకు ఎవరు అర్హుడు అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ సమయంలో ఆ సంస్థకు రతన్ టాటా తర్వాత అర్హుడైన వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. ఆయనే... రతన్ టాటాకు వరసకు సోదరుడు అయ్యే నోయల్ టాటా. దీంతో... ఎవరీ నోయల్ టాటా? కంపెనీలో ఈయన తన ప్రస్థానాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? ఏ మేరకు తన మార్కు పెర్ఫార్మెన్స్ చూపించారు? ఈయననే ఎందుకు ఎన్నుకున్నారు? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

వాస్తవానికి... టాటా గ్రూప్ లోని కంపెనీల్లో పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ నోయల్ టాటా పేరు వార్తల్లో పెద్దగా కనిపించదు. మీడియాకు ఆయన చాలా దూరంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం అని అంటారు. గ్రూపు గ్లోబల్ వెంచర్లు, రిటైల్ రంగంపై ప్రత్యేక దృష్టిని కలిగి ఉన్న ఆయన.. మీడియాకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారని చెబుతుంటారు.

రతన్ టాటాకు నావల్ టాటాకు వరసకు సోదరుడు అవుతారు. అదెలాగంటే...?.. నావల్ టాటాకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సూని సంతానం.. రతన్ టాటా, జిమ్మీ టాటాలు. రతన్ టాటా 1937లో జన్మించారనే సంగతి తెలిసిందే. అయితే... 1940లో నావల్ టాటా - సూనీ విడిపోయారు. దీంతో.. 1955లో నావల్.. సిమోనె అనే స్విట్జర్లాండ్ మహిళను వివాహం చేసుకున్నారు.

వారి కుమారుడే నోయల్ టాటా. స్వతహాగా వ్యాపారవేత్త అయిన సిమోనె... టాటా గ్రూపు రిటైల్ విభాగం విస్తరణకు చాలా శ్రమించినట్లు చెబుతారు. సస్సెక్స్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ, ఇన్సీడ్ నుంచి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాంను పూర్తి చేసిన నోయల్ టాటా... తన తల్లి తర్వాత టాటా గ్రూపు రిటైల్ విభాగం బాధ్యతలు చేపట్టారు.

రిటైల్ విభాగమైన ట్రెంట్ లో 1999లో బోర్డు సభ్యుడైన నోయల్ టాటా... తన తల్లి స్థాపించిన ఈ కంపెనీ అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. 1998లో ఒక్క బ్రాంచ్ మాత్రమే ఉన్న రిటైల్ వ్యాపారM.. నోయల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రస్తుతం 700 బ్రాంచ్ లకు విస్తరించింది.

ఈ క్రమంలో 2003లో టైటాన్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా కూడా నోయల్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ ప్రస్థానం మరింత విస్తరిస్తూ... ట్రెంట్ తో పాటు టాటా ఇన్వెట్మెంట్ కార్పొరేషన్ కు ఛైర్మన్ గా.. టైటాన్, టాటా స్టీల్ కు వైఎస్ ఛైర్మన్ గా.. టాటా ఇంటర్నేషనల్ కు ఎండీగా.. వోల్టాస్ బోర్డు సభ్యుడిగా కూడా నోయల్ టాటా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇక ఆయన కుటుంబం విషయానికొస్తే... నోయల్ భార్య ఆలూ పల్లోంజీ మిస్త్రీ కుమర్తె కాగా.. ఆమె కుటుంబానికి టాటా గ్రూపులో పెద్దమొత్తంలో వాటాలున్నాయి. ఈ దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. వారి పేర్లు... లేహ, మాయ, నెవిల్లె! ఈ ముగ్గురికీ కూడా టాటా ట్రస్టులో సభ్యత్వం ఉంది.

వీరిలో పెద్ద కుమార్తె లేహ.. ఇండియన్ హోటల్స్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉండగా... రెండో కుమార్తె మాయ.. ట్రింట్, స్టార్ బజార్ లీడర్ షిప్ టీం లో చేస్తున్నారు. ఇక కుమారుడు నెవిల్లె.. జుడియో, స్టార్ బజార్ లను పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News