రతన్ టాటా వారసుడిని కన్ఫాం చేశారు!... తెరపైకి కొత్త పేరు!

అవును... రతన్ టాటా మరణానంతరం తెరపైకి వచ్చిన "టాటా ట్రస్ట్ ఛైర్మన్ ఎవరు" అనే ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికిందని అంటున్నారు.

Update: 2024-10-11 09:30 GMT

రతన్ టాటా మరణం తర్వాత టాటా ట్రస్ట్ ఛైర్మన్ ఎవరవుతారనే చర్చ సహజంగానే మొదలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా ముగ్గురు పిల్లలపై చర్చ జరిగింది. అయితే... తాజా నివేదికల ప్రకారం... టాటా గ్రూపు కోసం రతన్ టాటా వారసుడిని ఖరారు చేశారని తెలుస్తోంది.

అవును... రతన్ టాటా మరణానంతరం తెరపైకి వచ్చిన "టాటా ట్రస్ట్ ఛైర్మన్ ఎవరు" అనే ప్రశ్నకు తాజాగా సమాధానం దొరికిందని అంటున్నారు. ఈ మేరకు తాజాగా సమావేశమైన టాటా ట్రస్టు... ఈ సమావేశంలో రతన్ టాటా వారసుడిని ఖరారు చేసిందని చెబుతున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం... నోయెల్ టాటా ను టాటా ట్రస్ట్ కు అధిపతిగా ఎన్నుకున్నారు!

రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా ప్రస్తుతం సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్ ట్రస్టీగా ఉన్నారు. అయితే... టాటా గ్రూపుకు మాతృ సంస్థ అయిన టాటా సన్స్ లో ఈ రెండు ట్రస్టుల మొత్తం హోల్డింగ్ 66 శాతం గా ఉందని అంటున్నారు. వాస్తవానికి నోయెల్ టాటా ఎక్కువగా.. తెరవెనుక పనిచేయడానికి ఇష్టపడతారని అంటుంటారు.

గ్రూపు గ్లోబల్ వెంచర్లు, రిటైల్ రంగంపై ప్రత్యేక దృష్టిని కలిగి ఉన్న ఆయన.. మీడియాకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారని చెబుతుంటారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఇకపై తన అన్నగారైన రతన్ టాటా బాధ్యతను తాను నిర్వర్తించనున్నారని తెలిస్తోంది.

కాగా... గత 40 సంవత్సరాలుగా టాటా గ్రూపులో భాగంగా ఉన్నారు నోయెల్ టాటా. ప్రస్తుతం ఆయన... పలు టాటా గ్రూపు కంపెనీల బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఇదే క్రమంలో... 2010 ఆగస్టు నుంచి 2021 నవంబర్ వరకూ టాటా గ్రూపుకు చెందిన రిటైల్ కంపెనీ ట్రెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గానూ ఉన్నారు.

ఈయన హయాంలోనే 500 మిలియన్ డాలర్లుగా ఉన్న ట్రెంట్ టర్నోవర్ 3 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇదే క్రమంలో... టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్, టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ కి వైఎస్ ఛైర్మన్ గా.. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా కూడా పనిచేశారు.

Tags:    

Similar News