ఈసారి ఫ్యామిలీ ఫ్యామిలీ సైబర్ అరెస్ట్... ఎంత దోచేశారో తెలుసా?
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫ్యామిలీ మొత్తం డిజిటల్ అరెస్టైన విషయం తెరపైకి వచ్చింది.
నిత్యం ఎదో ఒక మూల సైబర్ క్రైమ్ బాధితులు తెరపైకి వస్తూనే ఉన్నారు. ఇంకో పక్క పోలీసులు, ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ సరికొత్త పంథాలు అనుసరిస్తూ సైబర్ నేరగాళ్లు జూలు విధిలిస్తూనే ఉన్నారు. బాధితులు లబో దిబో మంటూనే ఉన్నారు! ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఫ్యామిలీ మొత్తం డిజిటల్ అరెస్టైన విషయం తెరపైకి వచ్చింది.
అవును... ఇటీవల సైబర్ నేరగాళ్లు తాము ప్రభుత్వ అధికారులమని చెప్పడంతో పాటు ఆ అధికారుల యూనిఫామ్ లో కనిపిస్తూ వీడియోకాల్స్ చేస్తున్నారు. దీంతో.. అతడు నిజమైన అధికారా కాదా అని ఆలోచించే అంత గ్యాప్ కూడా ఇవ్వకుండా.. నెక్స్ట్ మరో డిపార్ట్మెంట్ నుంచి మరో అధికారి కాల్ చేస్తున్నట్లు చేస్తుంటారు. ఇలా ఫోన్ కాల్స్ తో ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటారు.
ఈ నేపథ్యలో ఇటీవల ఢిల్లీలోని నొయిడాకు చెందిన ఓ కుటుంబం డిజిటల్ అరెస్ట్ కు గురైందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఓఅ కుటుంబం నుంచి అయిదు రోజుల్లో కోటి రూపాయలకు పైగా కాజేశారు సైబర్ నేరగాళ్లు. ఈ సందర్భంగా... తాము ప్రభుత్వ అధికారులమని చెప్పి ఈ మోసానికి పాల్పడ్డారు.
ఈ ఘటనలో చంద్రబాన్ పలివాల్ అనే వ్యక్తి కుటుంబం బాధితులుగా మిగిలారు! ఈ సందర్భంగా తాజాగా ఈ ఘటనపై చంద్రబాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసలేం జరిగిందనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా... ఫిబ్రవరి 1వ తేదీన ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని చెప్పాడు.
ఈ సందర్భంగా స్పందించిన అవతలి వ్యక్తి.. టెలికాం రెగ్యులేటరీ బోర్డుకు ఫోన్ చేయాలని.. లేదంటే సిమ్ కార్డు బ్లాక్ చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు. అనంతరం కాసేపటికే మరో వ్యక్తి ఫోన్ చేసి.. మీ కేసు ముంబై క్రైమ్ బ్రాంచ్ వద్ద ఉందని బెదిరింపులకు పాల్పడ్డాడట. ఈ సమయంలో 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చినట్లు తెలిపాడు.
ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి తానొక ఐపీఎస్ అధికారి అని వీడియో కాల్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ముంబైలోని కొలావా పోలీస్ స్టేషన్ నుంచి చేస్తున్నట్లు చెబుతు.. చంద్రబాన్ పై 24 కేసులు నమోదు అయినట్లు చెప్పాడట. ఇందులో మనీ ల్యాండరింగ్ కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు తెలిపాడట.
ఇదే సమయంలో తన భార్య, కుమార్తె ను కూడా డిజిటల్ అరెస్ట్ చేసినట్లు చంద్రబాన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమయంలో ఫైనల్ గా... తాము అడిగిన మొత్తం చెల్లించాలని, అలాకానిపక్షంలో అరెస్ట్ తప్పదని బెదిరింపులకు పాల్పడినట్లు చెబుతున్నారు. దీంతో... సుమారు ఒక కోటి 10 లక్షలు చెల్లించినట్లు చంద్రబాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడని తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు... ఏ పోలీసూ వీడియో కాల్ చేసి డబులు డిమాండ్ చేయరని, బెదిరింపులకు పాల్పడరని.. ఆ విషయంలో ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు!