ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు పెరగవు!
ఇక ఎమ్మెల్యే సీట్ల విషయానికొస్తే... ఏపీలో ఉన్న 175 కాస్తా.. 225, తెలంగాణలో ఉన్న 119 కాస్తా 153 అయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడిచింది.
గత కొంతకాలంగా ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ స్థానల సంఖ్య ఆల్ మోస్ట్ రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయని.. ఇందులో భాగంగానే ఏపీలో ప్రస్తుతం ఉన్న 25 ఎంపీ స్థానాలు 52 కి, తెలంగాణలో ఉన్న 17 స్థానాలు 39కి పెరుగుతాయని చర్చ జరిగేది. ఇక ఎమ్మెల్యే సీట్ల విషయానికొస్తే... ఏపీలో ఉన్న 175 కాస్తా.. 225, తెలంగాణలో ఉన్న 119 కాస్తా 153 అయ్యే అవకాశాలున్నాయనే చర్చ నడిచింది.
పైగా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం... దేశంలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించిందనే అభిప్రాయాలు తెరపైకి వచ్చాయి. మరోపక్క ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ 2026 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని గతంలో కేంద్రం, లోక్ సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది.
వీటికి తోడు ఇప్పట్లో ఏపీ తెలంగాణలో ఎమ్మెల్యే సీట్లు పెరిగే అవకాశం లేదనేందుకు మరో బలమైన అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... దేశంలో జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు కారణం... తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పరిమిత కేటాయింపులు చేయడమే అని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియకు కేంద్రం కేవలం రూ.1,309.46 కోట్లను కేటాయించింది!
దీంతో... ఇప్పట్లో జనగనన లేనట్లేనని.. ఫలితంగా జనగణన, కులగణన లేకుండా నియోజకవర్గాల పునర్విభజన సాధ్యం కాదని స్పష్టం అవుతుంది! కారణం... మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఈ ఏడాది జనగణనకు కేంద్రం కేటాయించిన మొత్తం చాలా తక్కువ. 2024-22లో జనగణనకు కేంద్రం రూ.3,768 కోట్లు ప్రతిపాదించింది. అయినప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు.
ఇక 2023-24 బడ్జెట్ లో కేవలం రూ.578.29 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక తాజా బడ్జెట్ లో దీనికి ఇంకాస్త పెంచుతూ... రూ.1309 కోట్లు కేటాయించింది. అయితే ఇది జనగణన అంచనా వ్యయం కంటే చాలా తక్కువని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈఏడాది కూడా దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ఉండదని.. ఫలితంగా ఎమ్మెల్యే, ఎంపీ సీట్ల పునర్విభజనకు ఛాన్స్ లేదని చెబుతున్నారు.