ఇకపై టోల్ గేట్స్ ఉండవ్!... ఫాస్ట్ ట్యాగ్ కు మించి కొత్త విధానం!

అవును... ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ విధానానికి సైతం స్వస్తి పలికి.. సరికొత్త విధానం తీసుకురావడానికి కేంద్రం సన్నద్దమవుతోంది.

Update: 2024-07-29 13:28 GMT

టోల్ గేట్స్ వద్ద వేచి ఉండే విషయాల్లో ప్రధానంగా పండుగ సమయాల్లో తెలంగాణ-ఏపీ బోర్డర్ లో చాలా మందికి చాలా (చేదు) అనుభవాలే ఉన్నాయని అంటారు. గతంలో టోల్ గేట్స్ వద్ద చాలా సేపు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఫాస్ట్ ట్యాగ్ విధానం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి అంతకు మించిన కొత్త విధానం తీసుకురాబోతున్నారు.

అవును... ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ విధానానికి సైతం స్వస్తి పలికి.. సరికొత్త విధానం తీసుకురావడానికి కేంద్రం సన్నద్దమవుతోంది. ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇప్పటికే పలు సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రస్థావించారు. మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ మారుతోందని అన్నారు.

ఈ నేపథ్యంలోనే హైవేల మీద ఇకపై టోల్ గేట్స్ లేకుండా చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని అంటున్నారు. దీనికోసం.. ఫాస్ట్ ట్యాగ్ విధానానికి సైతం స్వస్తి చెప్పి శాటిలైట్ విధానం ద్వారా టోల్ కలెక్షన్ చేయడానికి కేంద్రం సిద్ధమవుతోందని చెబుతున్నారు. దీంతో... ఇదే జరిగితే వాహనదారులు ఇకపై హైవేల మీద ఎక్కడా ఆగాల్సిన పనిలేదని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన నితిన్ గడ్కరీ... గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (జీ.ఎన్.ఎస్.ఎస్.) ద్వారా టోల్ కలెక్షన్ చాలా సులభమని.. ఇప్పటికే బెంగళూరు - మైసూర్ నేషనల్ హైవే 275తో పాటు హర్యానాలోని పానిపట్ – హిసార్ నేషనల్ హైవే 709 మధ్యలో ఈ విధానం ద్వారా టోల్ వసూల్ చేయడానికి సంబంధించిన ట్రైల్ కూడా సక్సెస్ ఫుల్ గా పూర్తైనట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో... దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ నూతన విధానాన్ని అమలులోకి తేనున్నట్లు చెబుతున్నారు! అంతకంటే ముందుగా... ఈ విధానం గురించి వాహనదారుల్లో అవగాహన కల్పించడానికి ఓ వర్క్ షాప్ కూడా ఏర్పాటు చేసినట్లు గడ్కరీ పేర్కొన్నారు.

ఈ నూతన విధానం అమలులోకి వచ్చిన తర్వాత టోల్ ఫీజ్ చెల్లించడానికి ప్రత్యేకంగా వాహనాలను ఆపాల్సిన అవసరం లేదు! వాహనం ప్రయాణించిన దూరాన్ని శాటిలైట్ లెక్కగట్టి అమౌంట్ ను వ్యాలెట్ నుంచి కట్ చేసుకుంటుంది. దీనికోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్.ఎఫ్.ఐ.డీ) చిప్ కలిగిన ట్యాగ్ ను వాహనానికి అతికించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News