వింత సౌండ్స్‌తో సౌత్‌కొరియా ప్రజలకు చుక్కలు చూపిస్తున్న నార్త్‌కొరియా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అన్నిదేశాల అధినేతలతో పోలిస్తే ఆయన రూటే సెపరేటు.

Update: 2024-11-17 08:35 GMT

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అన్నిదేశాల అధినేతలతో పోలిస్తే ఆయన రూటే సెపరేటు. పొరుగు దేశాలను ఇబ్బంది పెట్టాలన్నా.. టార్గె్ట్ చేయాలన్నా ఆయనకు ఆయనే సాటి. ఏదైనా చెప్పాడంటే అది ఖచ్చితంగా చేసి తీరుతాడనేది అందరికీ తెలిసిందే. తాజాగా దక్షిణకొరియా విషయంలోనే అదేరకంగా వ్యవహరించారు. ఏకంగా సియోల్‌ను కలిసే సరిహద్దు రోడ్లను పేల్చివేయించాడు.

ఎప్పుడూ ఇతర దేశాలకు సవాళ్లు విసిరే కిమ్.. ఇప్పుడు తన దృష్టి ఆత్మహుతి డ్రోన్ల ఉత్పత్తిపై పడింది. అత్యంత చౌకగా ఉత్పత్తి చేస్తూ.. ప్రభావవంతంగా దాడులు చేయగల ఈ డ్రోన్లు.. తమకు బాగా ఉపయోగపడుతాయని కిమ్ ఆలోచన. తక్షణమే దేశంలో ఈ ఆత్మాహుతి డ్రోన్ల ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇటీవల ఈ డ్రోన్ల ఆపరేషన్‌ను కిమ్ స్వయంగా పరిశీలించారు. భూతలం, సముద్రంలోనూ నిర్దేశించిన టార్గెట్ పైకి ప్రయోగించారు. ఆయా డ్రోన్లు సమర్థవంతంగా లక్ష్యాల్ని చేరుకున్నాయి. తమ టార్గెట్‌ను ఛేదించాయి. ఆ వెంనే డ్రోన్ల తయారీపై కొరియా సైన్యం దృష్టి పెట్టింది. ఈ మేరకు కిమ్ సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది. తమకు కావాల్సిన డ్రోన్లను తామే స్వయంగా తయారుచేసుకోవాలని ఆదేశించారు.

ఇదిలా ఉంటే.. సౌత్ కొరియాలోని సరిహద్దు గ్రామాల ప్రజలను వేధించడానికి నార్త్ కొరియా లౌడ్‌స్పీకర్లతో యుద్ధం మొదలుపెట్టింది. దెయ్యాల అరుపులు, క్రాష్ సౌండ్స్‌ను రోజంతా ప్లే చేస్తూ అక్కడి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. దీనిని నాయిస్ బాంబింగ్‌గా పిలుస్తున్నారు. ఈ శబ్దాల వల్ల తమకు నిద్ర కరువైందని, తలనొప్పి, మానసిక సమస్యలు వస్తు్న్నాయని డాంగ్సన్ గ్రామ ప్రజలు వాపోతున్నారు. అయితే.. కొన్ని నెలలుగా ఇదే తంతు కొనసాగుతోందని వారు వాపోతున్నారు.

Tags:    

Similar News