తెలుగుదేశం పార్టీకి ఓటేశారని రేషన్ బంద్.. నిజమా?

జిల్లాకు చెందిన కుందుర్పి మండలం బెస్తరపల్లి రేషన్ షాపు పరిధిలోని కార్డుదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.

Update: 2024-06-10 08:30 GMT

ఏపీలో సిత్రవిచిత్రమైన సీన్లు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఎన్నికలు ముగిసి.. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ తన అధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటుంది. అప్పటివరకున్న పరిస్థితుల్లో మార్పు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అయితే.. ఇందుకు భిన్నమైన ద్రశ్యాలు ఏపీలో కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ సానుభూతిపరులు.. మద్దతుదారులు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కోవాల్సి రావటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ హయాంలో ప్రభుత్వ పథకాలతో లబ్థి పొంది.. ఓటు వేయకుండా సైకిల్ పార్టీకి ఓటు వేస్తారా? అంటూ ఒక రేషన్ డీలర్ వీరంగం వేయటమే కాదు.. తనకు ఇప్పుడు ఖాళీ లేదని.. తనకు తోచిన టైంలో రేషన్ ఇస్తానంటూతిరిగి పంపిస్తున్న వైనం షాకింగ్ గా మారింది. అతగాడి తీరుతో అసహనం వ్యక్తం చేస్తూ రేషన్ కోసం వచ్చిన కార్డుదారులు రేషన్ కోసం ఆందోళన చేయటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. ఈ విచిత్రమైన ఉదంతం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

జిల్లాకు చెందిన కుందుర్పి మండలం బెస్తరపల్లి రేషన్ షాపు పరిధిలోని కార్డుదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. నిత్యవసర వస్తువుల పంపిణీలో సదరు డీలర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. గ్రామంలో రెండు రేషన్ షాపులు ఉన్నాయి. వైసీపీకి చెందిన నాయకుడైన ఒక డీలర్.. తమ పార్టీకి ఎన్నికల్లో ఓటు వేయకుండా.. తమను మోసం చేసి ఓడించారంటూ నిప్పులు చెరుగుతున్నాడు.

అందుకే తాను సరుకులు ఇప్పుడు ఇవ్వలేనని చెబుతూ.. ‘నాకు తీరిక లేదు. నాకు తీరిక ఉన్నప్పుడు సరుకులు ఇస్తా. అప్పుడు వచ్చి తీసుకెళ్లండి’ అంటూ లబ్థిదారులకు చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో.. అతగాడి తీరుకు విసిగిపోయిన కార్డుదారులు తాజాగా ఆందోళన చేపట్టారు. అధికారులు ఇప్పటికైనా కలుగుజేసుకొని చర్యలు తీసుకోవాలని లబ్థిదారులు కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వం కొలువు తీరనున్న వేళలోనూ ఇలాంటి ఉదంతం చోటు చేసుకోవటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News