మీరు ఎన్నారైలా.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఐటీ బారిన!

ఇది పన్ను (ట్యాక్స్‌) నిబంధనలను కఠినతరం చేయడానికి ఆర్థిక విషయాలలో పారదర్శకత కోసం చేస్తున్న ప్రయత్నమని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.

Update: 2024-09-03 19:30 GMT

మీరు విదేశాల్లో నివసిస్తున్న భారతీయు (ఎన్నారై)లా అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే భారత ప్రభుత్వం మీ విదేశీ ఆస్తులు, మీరు ఎక్కడ నివసిస్తున్నారనే అంశాలపై దృష్టి సారిస్తోంది.

ఈ మధ్య కాలంలో భారత ఆదాయ పన్ను శాఖ (ఐటీ విభాగం) ఎన్నారైలకు నోటీసులు జారీ చేసింది. ఎన్నారైలు ఎక్కడ ఉంటున్నారో చెప్పాలని, భారతదేశం వెలుపల వారు కొనుగోలు చేసిన ఆస్తులు, బ్యాంక్‌ ఖాతాల వివరాలను చెప్పాలని ఆ నోటీసుల్లో కోరింది.

ఇది పన్ను (ట్యాక్స్‌) నిబంధనలను కఠినతరం చేయడానికి ఆర్థిక విషయాలలో పారదర్శకత కోసం చేస్తున్న ప్రయత్నమని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న ఎన్నారైలు పన్ను ప్రయోజనాలు పొందాలంటే 1961 నాటి భారత ఆదాయ పన్ను చట్టం గురించి తెలుసుకోవాల్సిందే. ఆ చట్టం ప్రకారం.. ఎన్నారైగా ఉన్నారా, లేదా లేక రెసిడెంట్‌ గా ఉన్నారా అనేది తెలుసుకోవాలి.

అమెరికాలో ఎన్నారైగా ఉంటే మీరు భారతదేశంలో సంపాదించిన ఆదాయంపై మాత్రమే పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. 2015 బ్లాక్‌ మనీ చట్టం ప్రకారం.. ఎన్నారైలు ప్రతి సంవత్సరం ఏదైనా విదేశీ ఆస్తులను కలిగి ఉంటే ఆదాయ పన్ను విభాగానికి సమాచారం ఇవ్వాల్సి ఎన్నారైలు విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే భారీ జరిమానాలు లేదా జైలు శిక్షను కూడా ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా ఫెమా (ఫారిన్‌ ఎక్సే్ఛంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌) 1999 చట్టం కింద మీ విదేశీ ఆస్తులను తెలుసుకోవడానికి భారత ప్రభుత్వానికి అవకాశమిస్తుంది.

భారతదేశంలో పన్ను ప్రయోజనాలకు సంబంధించి నివాస స్థితి పెద్ద పాత్ర పోషిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 182 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉంటే మిమ్మల్ని ఇక్కడి నివాసులుగా పరిగణిస్తారు.

ఈ విషయంలో ఎన్నారైలకు మరింత అనుకూలంగా నియమాలు ఉన్నాయి. ప్రత్యేకించి... మీరు భారతీయ పౌరుడు లేదా భారతదేశాన్ని సందర్శించే భారతీయ మూలం (ఇండియన్‌ ఆరిజన్‌) అయితే.

భారత ప్రభుత్వం మిమ్మల్ని నివాసిగా పరిగణించినట్లయితే.. మీరు ఏదైనా .. బ్యాంక్‌ ఖాతాలు, ఆస్తులు లేదా పెట్టుబడులతో సహా మీ అన్ని విదేశీ ఆస్తులను ప్రకటించాల్సి ఉంటుంది.

ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే జరిమానాలు, ఇతర చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీరు భారతీయ ఆదాయపన్ను విభాగం అధికారుల నుండి నోటీసును అందుకుంటే వెంటనే స్పందించాల్సి ఉంటుంది.

మీ నివాస స్థితి (రెసిడెన్సీ)ని తెలుసుకోవడానికి పాస్‌ పోర్ట్‌ కాపీలు, వీసా వివరాలు, మీ ప్రయాణ చరిత్ర వంటి పత్రాలను అందించాలని మిమ్మల్ని కోరవచ్చు.

అలాగే మీరు మీ విదేశీ ఆస్తులను కూడా బహిర్గతం చేయాలి. అలాగే మీ ఆర్థిక సమాచారంలో ఏవైనా తేడాలున్నా వివరించాల్సి ఉంటుంది. ఐటీ శాఖ ఇచ్చే నోటీసులను విస్మరిస్తే ఆ శాఖ తీసుకునే చర్యలకు బాధ్యులవుతారు.

ఈ నేపథ్యంలో కఠిన చర్యలకు గురికాకుండా ఉండాలంటే మీ విదేశీ ప్రయాణాలు, విదేశీ ఆస్తులకు సంబంధించిన వివరాల రికార్డులను భద్రపర్చుకోండి. అలాగే మీ పన్ను రిటర్న్‌లను క్రమం తప్పకుండా ఫైల్‌ చేయండి. మీరు ఏటా విదేశాల్లో ఉన్న ఆస్తులను (ఉంటే) వెల్లడించారని నిర్ధారించుకోండి.

Tags:    

Similar News