ట్రాన్స్ జెండర్లపై అసభ్య మెసేజ్ లు.. 100 మంది అధికారులపై వేటు

అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) తాజాగా ఇంటెలిజెన్స్ అధికారులపై భారీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది.

Update: 2025-02-26 18:30 GMT

అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్ఎస్ఏ) తాజాగా ఇంటెలిజెన్స్ అధికారులపై భారీ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. ఈ ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన చాట్ టూల్‌ను కొందరు అధికారులు అసభ్యకరమైన సందేశాల కోసం ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్.ఎస్ఏ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ 100 మందికి పైగా అధికారులపై వేటు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

- ఆరోపణలపై అధికారులపై వేటు

ఈ చాట్ టూల్‌ను ఇంటెలిజెన్స్ సంబంధిత అత్యంత గోప్యమైన సమాచారాన్ని చర్చించేందుకు వినియోగించాల్సిన అవసరం ఉంది. అయితే కొందరు అధికారులు దీన్ని అసభ్యకరమైన సందేశాలకు వేదికగా మార్చారని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై స్పందించిన తులసీ గబ్బార్డ్, మంగళవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక ప్రకటన చేశారు.

- 100 మందికి పైగా అధికారులపై చర్యలు

"ఇందులో పాల్గొన్న 15 ఏజెన్సీలకు చెందిన 100 మందికి పైగా అధికారులపై చర్యలు చేపట్టాం. వారిపై భద్రతా క్లియరెన్స్ తొలగించేందుకు ఆదేశాలు జారీ చేశాం. ఇది ఏజెన్సీ నైతికతను, వృత్తిపరమైన నియమాలను తీవ్రంగా ఉల్లంఘించడం" అని తులసీ గబ్బార్డ్ స్పష్టం చేశారు. అయితే ఈ సంభాషణల్లో పాల్గొన్న అధికారులను శుక్రవారానికి గుర్తించాలని తులసీ గబ్బార్డ్ జారీ చేసిన మెమోను ఏజెన్సీ కార్యాలయ ప్రతినిధి ఎక్స్ లో పోస్ట్ చేశారు.

- ఎన్ఎస్ఏ అధికారిక ప్రకటన

ప్రభుత్వ చాట్ టూల్‌ను కొందరు అసభ్యకరమైన విధంగా ఉపయోగించడం అసహ్యకరమని ఎన్ఎస్ఏ ప్రకటించింది. "ఇది ఒక తీవ్రమైన నైతిక ఉల్లంఘన. సంబంధిత అధికారులను బాధ్యతల నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం" అని ఎన్ఎస్ఏ, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI) సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

- వివాదాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన హక్కుల కార్యకర్త

ఈ వివాదాన్ని తొలుత హక్కుల కార్యకర్త క్రిస్టోఫర్ రూఫో బయటపెట్టారు. ట్రాన్స్ జెండర్‌లకు సంబంధించిన సందేశాలు ప్రభుత్వ చాట్ టూల్‌లో ఇంటర్‌లింక్‌గా కనిపించినట్లు రూఫో తెలిపారు. దీంతో ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపింది.

ఇంటెలిజెన్స్ అధికారులు అత్యంత గోప్యమైన సమాచారాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత వహించాల్సిన స్థితిలో ఉండగా కొందరు దాన్ని వ్యతిరేకంగా ఉపయోగించడం వివాదానికి దారితీసింది. ఈ కేసు భవిష్యత్తులో ఇంటెలిజెన్స్ సంస్థల్లో నైతిక ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేసేలా మార్గదర్శకంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News