పాతబస్తీ వాసులకు ఓటు వేయడం ఇష్టం లేదా?

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓటు విలువను గుర్తిస్తారు. ఓటుకు ప్రాధాన్యం ఇస్తారు. ఓటు వేయడం తమ గురుతర బాధ్యతగా భావిస్తారు

Update: 2024-05-13 10:00 GMT

ప్రపంచంలోని చాలా దేశాల్లో ఓటు విలువను గుర్తిస్తారు. ఓటుకు ప్రాధాన్యం ఇస్తారు. ఓటు వేయడం తమ గురుతర బాధ్యతగా భావిస్తారు. కానీ మనదేశంలో మాత్రం మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు? అన్న చందంగా ఆలోచిస్తారు. లాభం లేకపోతే ఏ పని కూడా చేయడానికి ఇష్టపడరు. ఇందులో భాగంగా నేడు ఎన్నికలు జరుగుతున్న హైదరాబాద్ లాంటి చోట ఓటు వేసేందుకు ప్రజలు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. దీంతో ఓటింగ్ శాతం తగ్గే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

భాగ్యనగరంలో ఎందుకు ఓటు వేయడానికి చొరవ చూపించడం లేదు. ఓటేస్తే మాకేమొస్తుందనే మొండి వాదన తప్ప తమ బాధ్యత అని ఎంత మంది గుర్తిస్తున్నారు. చూస్తే పెద్ద నగరం కానీ ఓటు వేయాలనే చిన్న ఆలోచన కూడా పాటించడం లేదంటే వారికి ప్రజాస్వామ్యం మీద ఏపాటి శ్రద్ధ ఉందో తెలుస్తోంది. ఈనేపథ్యంలో ప్రజాసందోహం ఉన్నప్రాంతంలోనే ఓటింగ్ కోసం ముందుకు రావడం లేదంటే నిజంగా దౌర్భాగ్యమే.

ఎన్నికల సంఘం అధికారులతో పాటు పోలీసులు, యువత ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటి గేటు తడుతూ అమ్మా ఓటు వేయాలని కోరుతున్నారు. ఇలాగైనా ఓటు వేసేందుకు వస్తారనే చిన్న ఆశతో ఇలా చేస్తున్నారు. ఓటర్లను చైతన్య పరచాల్సిన అవసరం రావడం గమనార్హం. ఎక్కడో మారుమూల ప్రాంతాలంటే సరే కాని అత్యంత అక్షరాస్యత కలిగిన ప్రాంతంలో ఓటు వేసేందుకు జనం ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదు.

పాతబస్తీలో చాలా మంది ఓటు వేసేందుకు రావడం లేదు. ఇక్కడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వ పథకాలు కావాలనే అడిగే వారే ప్రభుత్వ ఏర్పాటుకు ఓటు వేసేందుకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇలా స్వచ్ఛందంగా ఓటు వేయాల్సి ఉన్నా బయటకు రండి ఓటు వేయండి అని కోరడం సంచలనం కలిగిస్తోంది.

మనదేశంలో కనీసం ఓటు వేయడానికి కూడా ఇంత బద్ధకమా? ఓటు వేయడం మన బాధ్యత కాదా? ప్రతి పౌరుడు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మంచి నాయకుడి ఎన్నికలో తాను కూడా పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఓటింగ్ శాతం భారీగా తగ్గే సూచనలున్నాయని అధికార యంత్రాంగం కలవరపడుతోంది.

Tags:    

Similar News