ఈ ముఖ్యమంత్రి ఫిట్ నెస్ మామూలుగా లేదు... వీడియో వైరల్!
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినా.. ఇప్పుడు చెమటలు పట్టండి - తర్వాత మెర్పులు మెరవండి అని జిమ్ లలో బోర్డులు పెట్టినా
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినా.. ఇప్పుడు చెమటలు పట్టండి - తర్వాత మెర్పులు మెరవండి అని జిమ్ లలో బోర్డులు పెట్టినా.. విషయం మాత్రం ఒకటే.. ఫిట్ గా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, అంతకు మించిన భాగ్యం లేదని. ఈ విషయంలో తాజాగా తనదైన ఫిట్ నెస్ ను చూపించారు జమ్మూకశ్మీర్ నూతన ముఖ్యమంత్రి.
అవును... 54 ఏళ్ల వయసున్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఫుల్ ఫిట్ నెస్ తో ఉన్నట్లు నిరూపించుకున్నారు. ప్రధానంగా తనలో ఉన్న క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. కశ్మీర్ లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన మారథాన్ లో అంచనాలకు అందన్ని ఫెర్ఫార్మెన్స్ ప్రదర్శించారు. ఇందులో భాగంగా.. 21 కిలోమీటర్ల దూరం పరుగెత్తారు.
వివరాళ్లోకి వెళ్తే... కశ్మీర్ లో మొట్టమొదటిసారిగా ఆదివారం మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రారంభించారు. ఇలా కశ్మీర్ లో జరిగిన తొలి అంతర్జాతీయ మారథాన్ లో ఐరోపా, ఆఫ్రికా దేశాలకు చెందిన క్రీడాకారులులతోపాటు 2 వేల మంది పాల్గొన్నారు.
వీరందరితోపాటు ఈ కార్యక్రమంలో జమూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్ధుల్లా కూడా పాల్గొని తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో 21 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో పూర్తిచేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ప్రపంచంలోనే అత్యుత్తమ కార్యక్రమంలో ఒకటిగా ఈ కశ్మీర్ మారథాన్ మారుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇక తన జీవితంలో 13 కి.మీ.కంటే ఎక్కువ దూరం ఎప్పుడూ పరుగెత్తలేదని చెప్పిన సీఎం... ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని.. ఈ కార్యక్రమంలో చాలా మంది పాల్గొన్నారని.. ఎంతో ఉత్సాహంగా వారితో పాటు తానూ ముందుకు సాగినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో... 18 - 35 సంవత్సరాల వయసు విభాగంలో 42 కిలోమీటర్లను 2.23 గంటల సమయంలో పూర్తి చేసిన షేర్ సింగ్ పురుషుల్లో మొదటి స్థానంలో నిలవగా... మహిళల్లో ప్రథమ స్థానంలో తామసీ సింగ్ నిలిచారు. ఈమె ఆ దూరాన్ని 3.03 గంటల్లో పూర్తిచేశారు. ఈ సందర్భంగా విజేతలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బహుమతులు అందజేశారు.