స్పీకర్ గా ఓం బిర్లా ఏకగ్రీవం

18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా ఏకగ్రీవంగా విజయం సాధించారు.

Update: 2024-06-26 09:30 GMT

18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ఓం బిర్లా ఏకగ్రీవంగా విజయం సాధించారు. బిర్లా కాంగ్రెస్‌కు చెందిన కె సురేష్‌తో పోటీ పడి గెలుపొందారు. లోక్ సభ ప్రారంభం కాగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓంబిర్లా పేరును ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు ఎన్డీఎ ఎంపీలు బలపరిచారు.

విపక్షాల అభ్యర్థిగా సురేష్ పేరును ఇండియా కూటమి నుండి శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ప్రతిపాదించారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపరిచారు. అయితే లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓం బిర్లా 17వ లోక్‌సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో కూడా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీయే మరోసారి ఆయనను అభ్యర్థిగా నిలబెట్టింది.

రాజస్థాన్‌లోని కోట లోక్ సభ స్థానం నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థి ప్రహ్లాద్ గుంజల్ పై 41,974 ఓట్ల మెజారిటీతో వరసగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 లో 2 లక్షల మెజారిటీతో, 2019లో 2.80 లక్షల మెజారిటీతో ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఎంపీ కూడా వరుసగా రెండు సార్లు స్పీకర్‌గా వ్యవహరించలేదు. లోక్ సభ సంఖ్యా బలం కారణంగా ఆయన గెలుపు ఖాయమైంది.

Tags:    

Similar News