వంద కోట్ల పరువు నష్టం దావా...ఫస్ట్ టైం జగన్ !
అయితే సీబీఐ కేసులు పడ్డాయి కానీ అంత మొత్తం కాదని దర్యాప్తు చేసిన అధికారులే తరువాత చెప్పారు. ఇక ఆయన రాజకీయం మీద నిజాలు కానివి ఎన్నో చాటింపు వేశారు.
జగన్ రాజకీయ జీవితంలో మీడియా పరంగా ఎదుర్కొన్నన్ని ఇబందులు ఎవరూ పడలేదు. జగన్ వైఎస్సార్ వారసుడిగా పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు. వైఎస్సార్ కి అనుకూలమైన నేతలు ఉన్నారు ఆయనను వ్యతిరేకించేవారు ఉన్నారు. వారే వైఎస్సార్ మరణానంతరం జగన్ కాళ్ళకూ అడ్డం పడ్డారు.
ఇక జగన్ తమకు ప్రత్యర్థిగా ఫ్యూచర్ లో అవుతారు అని భావించిన టీడీపీ కూడా ఆయనను ఆది నుంచి గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తోంది. దాంతో జగన్ కి అనుకూల ప్రచారం కంటే వ్యతిరేక ప్రచారమే మీడియాలో సాగుతూ వచ్చింది. జగన్ క్విడ్ ప్రోకో నతూ లక్ష కోట్లు అవినీతి అన్నారు.
అయితే సీబీఐ కేసులు పడ్డాయి కానీ అంత మొత్తం కాదని దర్యాప్తు చేసిన అధికారులే తరువాత చెప్పారు. ఇక ఆయన రాజకీయం మీద నిజాలు కానివి ఎన్నో చాటింపు వేశారు. ఇలా జగన్ విపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కూడా ఆయన మీద విమర్శలే చేస్తూ టార్గెట్ చేసింది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా.
అయితే ఏనాడూ దేనికీ ఖండించని జగన్ ఫస్ట్ టైం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద మండిపడ్డారు. తాను అదానీ నుంచి 1750 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నాను అని ఆధారం లేని రాతలు రాస్తారా అంటూ గర్జించారు. ఆ మీడియా సంస్థల మీద వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను అంటూ జగన్ ఆవేశం ప్రదర్శించారు.
ఇప్పటిదాకా జగన్ మీద వచ్చిన ఆరోపణలు అన్నింటి కంటే ఈ అవినీతి ఆరోపణ ఎక్కువ అని ఆయన భావించారా లేక ఇక ఇక్కడితో తన మౌనానికి స్వస్తి చెప్పకపోతే ఇంకా భారీ ఆరోపణలు చేస్తారు అనుకున్నారా లేక ఇపుడు కకున తాను సైలెంట్ అయితే వారు చెప్పినవే నిజాలు అని నమ్ముతారని తలచారా అన్నది తెలియదు కానీ జగన్ మాత్రం మీడియా ముందుకు వచ్చి తన మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద గట్టిగానే ఫైర్ అయ్యారు.
తాను దేశంలోనే చవకగా విద్యుత్ ఇస్తామంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెకీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంటే మెచ్చాల్సింది పోయి నిందలు వెస్తారా మధ్యలో ముడుపులు అని కధలు అల్లుతారా అంటూ ఆయన ఆగ్రహించారు.
ఇలా ఆధారం లేని రాతలు రాసినందుకు పరువు నష్టం దావా వేస్తాను అని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే చినబాబు చిరుతిళ్ళకు పాతిక కోట్లు అని టీడీపీ వ్యతిరేక మీడియాలో జగన్ సొంత పత్రికలో వార్త అచ్చేసినందుకు లోకేష్ కూడా ఇలాగే పరువు నష్టం దావా కేసుని విశాఖ కోర్టులో వేశారు.
ఇపుడు జగన్ కూడా అదే బాటన నడవాలని అనుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. అయితే ఇదిగో పులి అంటే అదిగో తోక అని రాతలు రాసే మీడియాలో నిత్యం ఇలాంటివి ఎన్నో వస్తూంటాయి. మరి వాటి మీద పరువు నష్టం అంటూ వెళ్తారా అన్నది మరో చర్చ.
అయితే జగన్ కి ఇలాంటివి కొత్త కానే కాదు మరి నాడు లేనిది నేడు ఎందుకు పరువు నష్టం అంటున్నారు ఎందుకు ఆయన ఆ మీడియా సంస్థల యాజమాన్యాల మీద పరువు నష్టం దావా అంటున్నారు అన్నది కూడా రాజకీయంగా చర్చకు వస్తున్న విషయం.
ఏది ఏమైనా గత కాలంలా ఉంటే ఏపీ రాజకీయాలు చేయడం కష్టమని ఇక తానే నోరు విప్పి ఫుల్ యాక్టివ్ అయితేనే తప్ప అంతా సర్దుకోదని భావించే జగన్ ఈ విధంగా గర్జించారని అంటున్నారు. మొత్తానికి జగన్ ఫైర్ చూసిన ఆయన వ్యతిరేక మీడియా ఏమనుకుందో తెలియదు కానీ వైసీపీ శ్రేణులు మాత్రం ఖుషీ అవుతున్నాయి. మా నాయకుడు ఇదే ఫైర్ తో ముందుకు సాగాగాలని మనసారా కోరుకుంటున్నాయి.