దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వన్ ప్లస్ ప్లాన్ ఇదే

స్మార్ట్ ఫోన్ల తయారీలో తనదైన ముద్ర వేసే చైనా కంపెనీ వన్ ప్లస్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Update: 2024-12-06 11:30 GMT

స్మార్ట్ ఫోన్ల తయారీలో తనదైన ముద్ర వేసే చైనా కంపెనీ వన్ ప్లస్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన తాజా ప్రణాళికను వెల్లడించింది. మొత్తంగా రూ.6వేల కోట్ల భారీ మొత్తాన్ని దేశంలో పెట్టుబడుల రూపంలోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా రానున్న మూడేళ్లలో.. ఏడాదికి రూ.2వేల కోట్ల చొప్పున పెట్టుబడులకు సిద్ధమవుతున్నట్లుగా వన్ ప్లస్ పేర్కొంది.

భారత్ లో ఉత్పత్తులు.. సేవల ఆవిష్కరణలను మరింత వేగవంతం చేయటానికి వీలుగా కొత్త ప్లాన్లను సిద్ధం చేసింది. మరింత క్వాలిటీ ఉత్పత్తుల్ని అందించటంతో పాటు.. అసాధారణమైన కస్టమర్ సేవలు.. భారత మార్కెట్ కోసం ప్రత్యేక ఫీచర్లను రెడీ చేయటం వన్ ప్లస్ ప్యూచర్ ప్లాన్లుగా చెబుతున్నారు.

ప్రాజెక్టు స్టార్ లైట్ కింద కొన్ని కీలక అంశాల్ని టేకప్ చేసింది. ఇందులో డిస్ ప్లే టెక్నాలజీ పురోగతిని వెంటనే ప్రారంభించాలని భావిస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి డిస్ ప్లే మేట్ ఏ++ nడిస్ ప్లే.. వన్ ప్లస్ ను తెగ ఇబ్బంది పెడుతున్న గ్రీన్ లైన్ వర్రీకి ఫ్రీ సొల్యూషన్ (వన్ ప్లస్ మొబైల్ ఫోన్లలో ఆకుపచ్చని గీతలు రావటం దాని వినియోగదారుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది) రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారు.

తమ కంపెనీకి భారత్ అతి ముఖ్యమైన మార్కెట్ గా వన్ ప్లస్ ఇండియా సీఈవో చెబుతున్నారు. ప్రాజెక్టు స్టార్ లైట్ కింద వన్ ప్లస్ తన సర్వీసు సెంటర్లను భారీగా పెంచాలని భావిస్తోంది. 2026 మధ్య నాటికి యాభై శాతం విస్తరించటంతో పాటు.. ఫ్లాగ్ షిప్ రిటైల్ స్టోర్లలో సగం వరకు అప్ గ్రేడ్ చేయాలని భావిస్తోంది. మొత్తంగా భారత్ లో మరింత బలమైన ప్రభావాన్ని చూపేందుకు వీలుగా ప్లాన్లను సిద్ధం చేసుకుంటుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News