ఒసామా బిన్ లాడెన్ కొడుకుపై ఫ్రాన్స్ కీలక నిర్ణయం!

ఈ నేపథ్యంలో లాడెన్ మరో కొడుకు ఒమర్ బిన్ లాడెన్ వ్యవహారం తెరపైకి వచ్చింది.

Update: 2024-10-09 04:03 GMT

ఇటీవల ఇంటర్నేషనల్ మీడియాలో ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ సజీవంగా ఉన్నాడని, ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థకు అతడే నాయకత్వం వహిస్తున్నాడని నివేదికలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాడెన్ మరో కొడుకు ఒమర్ బిన్ లాడెన్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇతడి విషయంలో ఫ్రాన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఆల్ ఖైదా మాజీ అధినేత ఒసామా బిన్ లాడెన్ కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల అతడు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల కారణంగా దేశం విడిచి వెళ్లాలని ఫ్రెంచ్ అధికారులు ఆదేశించారు. ఈ సందర్భంగా స్పందించిన అంతర్గత మంత్రి... అతడు ఏ కారణం చేతనైనా దేశానికి తిరిగి రాకుండా నిషేధిస్తున్నామని తెలిపారు.

కాగా... సౌదీ అరేబియాలో జన్మించిన ఒమర్ (43) సూడాన్, ఆఫ్గనిస్తాన్ లలో కొంతకాలం నివసించాడు. 19 సంవత్సరాల వయసులో తన తండ్రిని విడిచిపెట్టి చివరికి 2016 నుంచి ఉత్తర ఫ్రాన్స్ లోని నార్మాండీలో సెటిల్ అయ్యాడు. ఈ క్రమంలో ఓ బ్రిటీష్ పౌరురాలిని పెళ్లాడి.. పెయింటింగ్స్ వేసుకుంటూ సెటిల్ అయ్యాడని ఫ్రాన్స్ అంతర్గత మంత్రి బ్రూనో రిటైలే ఎక్స్ లో వెల్లడించారు.

ఈ సమయంలో... జీహాదీ కుమారుడు 2023లో తన సోషల్ నెట్ వర్క్ లలో ఉగ్రవాదాన్ని సమర్థించేలా చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు అని తెలిపారు. ఫలితంగా ఫ్రెంచ్ భూభాగాన్ని ఉత్తర్వ్యులు జారీ చేసినట్లు వెల్లడించారు. దేశ భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని, అందులోని చట్టబద్ధతను న్యాయస్థానాలు ధృవీకరించాయని ఆయన తెలిపారు.

ఇక, ఒమర్ బిన్ లాడెన్ బ్రిటీష్ పౌరురాలు జేన్ ఫెలిక్స్ బ్రౌన్ ను వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమె జైనా మహమ్మద్ గా పేరు మార్చుకున్నారు. ఆ సమయంలో ఒమర్.. యూకే లో నివసించడానికి ప్రయత్నించాడు కానీ.. అందుకు బ్రిటిష్ అధికారులు అంగీకరించలేదు!

Tags:    

Similar News