బ్యాంక్ లోన్ ఆఫీసర్ టు ఛైర్మన్... ఒసాము "సుజికీ" కన్నుమూత!
జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకీ కన్నుమూశారు.
ఓ బ్యాంక్ లో లోన్ ఆఫీసర్ గా జీవితాన్ని ప్రారంభించిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ కి ఛైర్మన్ స్థాయికి ఎదిగిన వ్యక్తి అస్తమించారు. దశాబ్ధాల పాటు సుజుకీ ఛైర్మన్ గా సేవలందించిన ఒసాము సుజికీ కన్ను మూశారు. ఈ విషయాన్ని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అవును... జపాన్ కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటార్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ ఒసాము సుజుకీ కన్నుమూశారు. బ్లడ్ క్యాన్సర్ తో బాదపడుతున్న ఆయన 94 ఏళ్ల వయసులో డిసెంబర్ 25న తుదిశ్వాస విడిచినట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా.. దశాబ్ధాల పాటు సుజుకీ ఛైర్మన్ గా ఆయన అందించిన సేవలు చర్చకు వస్తున్నాయి.
ఇందులో భాగంగా... జపాన్ కు మాత్రమే పరిమితమైన ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ మోటార్ కార్పొరేషన్ ని ప్రపంచవ్యాప్తం చేయడంలో ఒసాము సుజుకీ కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలో దశాబ్ధాల పాటు ఆ సంస్థకు ఛైర్మన్ గా సేవలందించారు.
కాగా... 1930 జనవరి 30న జపాన్ లోని గెరోలో ఒసాము జన్మించారు. ఆయన అసలు పేరు ఒసాము మత్సుడా. ఈయన స్థానిక బ్యాంకులో లోన్ ఆఫీసర్ గా కెరీర్ ప్రారంభించారు. ఈ క్రమంలో 1958లో షోహో సుజుకీని ఆయన వివాహం చేసుకున్నారు. అయితే... సుజుకీ కుటంబ వారసులు లేకపోవడంతో వ్వాహం అనంతరం ఆయన పేరు చివరన సుజికీ వచ్చి చేరింది.
అనంతర కాలంలో ఆయన కంపెనీ పగ్గాలు చేపట్టారు. ఈ సమయంలో మోటర్ సైకిళ్లు, కార్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో కీలక భూమిక పోషించారు. ఈయన హయాంలోనే జనరల్ మోటార్, ఫోక్స్ వ్యాగన్ వంటి ప్రముఖ కంపెనీలతో సుజుకీ వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇదే ఉత్తర అమెరికా, యూరప్ లో సుజికీ విస్తరించడానికి తోడ్పడింది.
ఈ నేపథ్యంలోనే భారత్ లోకి 1980లో ఎంట్రీ ఇచ్చింది సుజికీ. ఇందులో భాగంగా. ప్రభుత్వంతో కలిసి మారుతీ ఉద్యోగ్ పేరిట జాయింట్ వెంచర్ ని ప్రారంభించింది. ఆ తర్వాతి కాలంలోనే మారుతీ సుజుకీ గా అవతరించింది. ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద కార్య తయారీ కంపెనీగా ఉంది. ఈ కంపెనీ అప్పట్లో తీసుకొచ్చిన మారుతీ 800 దేశీయంగా పెద్ద చరిత్రనే సృష్టించింది.