Begin typing your search above and press return to search.

బిగ్ అలర్ట్... ఓయో రూమ్ కు వెళ్తున్నారా...?

సాధారణంగా ఓయో రూమ్ అంటే సమాజంలో ఎలాంటి భావన ఉందనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   28 Aug 2024 9:01 AM GMT
బిగ్ అలర్ట్... ఓయో రూమ్ కు వెళ్తున్నారా...?
X

సాధారణంగా ఓయో రూమ్ అంటే సమాజంలో ఎలాంటి భావన ఉందనేది తెలిసిన విషయమే. తక్కువ ధరకే రూమ్స్ ఇచ్చే హోటల్స్ చైన్ గా ప్రపంచానికి పరిచయం అయిన ఓయో.. ఇప్పుడు మాత్రం మరో రకమైన పేరు సంపాదించుకుందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమయంలో పలు రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.

అవును... "ఓయోకి వెళ్లాము..!" అని అంటేనే అదేదో తప్పు చేశారనే స్థాయి భావన అవతలివారిలో కలుగుతుందని కూడా అంటున్న పరిస్థితి. అలా అని.. అన్ని ఓయో రూమ్స్ పరిస్థితి అలా ఉందని చెప్పలేం కానీ... ఉన్నవాటిలో మెజారిటీ అలానే ఉన్నాయని మాత్రం చెప్పొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఓ దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రశాంతంగా, సంతోషంగా, ఏకాంతంగా కాసేపు హోటల్ గదిలో గడుపుదామని దగ్గర్లోని ఓయో రూమ్ కి వెళ్లిన జంటకు షాక్ తగిలింది. ఈ మేరకు ఆ హోటల్ నిర్వాహకుడే ఓ తప్పుడు పనికి పూనుకున్నాడు! అనంతర బ్లాక్ మెయిల్ కార్యక్రమానికి తెరలేపాడు!

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా శంషాబాద్ లోని ఓయో హోటల్ లో చీకటి బాగోతం ఒకటి వెలుగు చూసింది. ఈ హోటల్ గదుల్లో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశాడు హోటల్ నిర్వాహకుడు. ఈ సమయంలో ఎవరైనా ఆ హోటల్ గదులు అద్దెకు తీసుకున్న జంట.. ఏకాంతంగా ఉన్న సందర్భాన్ని చిత్రీకరిస్తున్నాడు.

వారి రోమాన్స్ ని చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఈ హోటల్ నిర్వాహకుడి బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారనేది తెలియదు కానీ... తాజాగా ఓ జంట మాత్రం.. నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడని పేర్కొంది.

దీంతో... పోలీసులు అ హోటల్ కి వెళ్లారు. గదుల్లో సీక్రెట్ గా అమర్చిన కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు! ఇదే సమయంలో నిందితుడి నుంచి 2 ఫోన్లను కూడా సీజ్ చేసి, అదుపులోకి తీసుకున్నారు! అతడిని ఒంగోలుకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు!