''చంద్రబాబు ట్రాప్‌లో రేవంత్ రెడ్డి''
దీనివెనుక చంద్రబాబు వ్యూహం ఉందని.. ఆ ట్రాప్‌లో రేవంత్ రెడ్డి చిక్కుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారంటూ.. వివాదాస్పద బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ నుంచి పెట్టుబడులను అమరావతికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆయన నాన్‌లోకల్-లోకల్ నినాదాన్ని తెరమీదికి తెచ్చారని వ్యాఖ్యా నించారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు గతంలో బీఆర్ ఎస్ హయాంలో చేసుకున్న ఒప్పందాల మేరకు పెట్టుబుడులు వస్తున్నాయని.. ఇప్పుడు వాటిని రాకుండా చేసే కుట్ర చేస్తున్నారని పాడి అన్నారు.
దీనివెనుక చంద్రబాబు వ్యూహం ఉందని.. ఆ ట్రాప్‌లో రేవంత్ రెడ్డి చిక్కుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైదరాబాద్ అంటే.. హైడ్రా గుర్తుకు వస్తోందని.. దీంతో పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతోందని తెలిపారు. కూల్చివేతలు.. పేల్చివేతలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని.. దీంతో పెట్టుబడులు పొరుగు రాష్ట్రానికి తరలి పోతున్నాయని ఆరోపించారు. ఇదంతా పెట్టుబడులను ఒక పద్ధతి ప్రకారం అమరావతికి తరలించే కుట్రగా కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదిలావుంటే..తనను అడ్డు పెట్టుకుని నాన్ లోకల్-లోకల్ వివాదాన్ని సృష్టించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్ని స్తున్నారని పాడి కౌశిక్ రెడ్డి చెప్పారు. ``నేను ఆంధ్రా సెటిలర్స్‌ను దూషించినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేనెవరినీ అనలేదు. అరికెపూడి గాంధీనే నన్ను ఇష్టారీతిగా మాట్లాడాడు. పైగా నా వ్యాఖ్యలను వక్రీకరించారు. నేనేదో ఆంధ్రా వాళ్లను తిట్టినట్లుగా ప్రచారం చేశారు. చిల్లర రాజకీయం కోసం ఆంధ్రా, తెలంగాణ వాదాన్ని రెచ్చగొట్టి హైదరాబాద్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు`` అని పాడి కౌశిక్ రెడ్డి ఎదురు దాడి చేశారు.
కేసీఆర్ బ్రాండ్‌కు దెబ్బ
రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో కష్టపడ్డారని కౌశిక్‌రెడ్డి చెప్పారు. అయి తే.. ఇప్పుడు ఆ కష్టాన్ని నాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. అందుకే బ్రాండ్ చెడగొట్టేదుకు.. ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని.. దానిని తనను పావుగా వినియోగించుకుంటున్నారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. కైశిక్ ఇలా యూటర్న్ తీసుకోవడం.. వెనుక రీజన్‌పై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.