బ్రేకింగ్... పాడి కౌశిక్ రెడ్డికి గుడ్ న్యూస్!
హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీసులో ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వెళ్తున్న సమయంలో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
బీఆరెస్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీసులో ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వెళ్తున్న సమయంలో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను పోలీసులు కరీంనగర్ కు తరలించారు.
ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో పాడి కౌశిక్ రెడ్డి గొడవపడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో సంజయ్ మాట్లాడుతున్న సమయంలో కల్పించుకున్న కౌశిక్ రెడ్డి అడ్డు తగిలారు.
ఈ సమయంలో సంజయ్ ని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి కామెంట్లు చేయడం.. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బీఆరెస్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్... తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు.
మరోపక్క కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో ఉన్న కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు కరీంనగర్ పోలీసులు. ఈ సమయంలో ఈ రోజు ఉదయం రెండో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు హాజరుపరచగా.. బెయిల్ మంజూరు చేశారు.
అంతకముందు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి న్యాయమూర్తి వద్దకు తరలించే క్రమంలో మీడియాతో మాట్లాడారు కౌశిక్ రెడ్డి. ఇందులో భాగంగా... ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలుపరిచే వరకూ తాను ప్రశ్నిస్తూనే ఉంటానని.. ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు!