9/11 కంటే భారీగా 7/10 ప్లాన్... పాక్ యువకుడు అరెస్ట్!

న్యూయార్క్ లో దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేశాడని ఆరోపిస్తూ కెనడాలో పాకిస్థాన్ కి చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-09-08 09:23 GMT

9/11 అటాక్ గా ప్రాచుర్యం పొందిన సెప్టెంబర్ 11 - 2001 దాడులు అగ్రరాజ్యం అమెరికాకు ఏ స్థాయిలో చేదు జ్ఞాపకాలను మిగిల్చాయనేది తెలిసిన విషయమే. ఆ రోజు ఆల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థ అమెరికా వాణిజ్య స్థానాలపై చేసిన దాడులో సుమారు మూడు వేలకు పైగా ప్రజలు మరణించారు. ఈ నేపథ్యంలో యూదులే లక్ష్యంగా ఈసారి ఇంతకు మించిన భారీ దాడికి ప్లాన్ జరిగినట్లు తెలుస్తోంది.

అవును... అమెరికాలో నివసిస్తున్న యూదులపై ఉగ్రదాడికి ప్లాన్ చేశారని.. న్యూయార్క్ లో దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేశాడని ఆరోపిస్తూ కెనడాలో పాకిస్థాన్ కి చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అమెరికా న్యాయశాఖ ఈ విషయాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆ యువకుడి మేరు మహ్మద్ షాజేబ్ అలియాస్ షాజేబ్ జాదూన్ (20) అని తెలిపారు. యూఎస్ ఇతడిపై పలు అభియోగాల కింద అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన యూఎస్ అటార్నీ జనరల్ మెరిక్ గార్లాండ్... మహ్మద్ షాజేబ్ అక్టోబర్ 7 నాటికి న్యూయార్క్ నగరంలో ఇస్లామిక్ స్టేట్ పేరుతో ఉగ్రదాడికి ప్లాన్ చేశాడని ఆరోపించారు. ఈ దాడుల లక్ష్యం.. వీలైనంత ఎక్కువ మంది యూదులను చంపడమే అని ఆయన వెల్లడించారు. ఇజ్రాయేల్ - హమాస్ మధ్య జరిగిన యుద్ధానికి సంబంధించి ఈ దాడికి సిద్ధమవుతున్నారని చెబుతున్నారు.

వాస్తవానికి గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయేల్ - హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ యుద్ధం మొదలై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ పాక్ యువకుడు ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేశారని అంటున్నారు. ఈ మేరకు బ్రూక్లిన్ లోని యూదుల కేంద్రంలో మాస్ షూటింగ్ కు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News