పాకిస్థాన్ లో గుడ్డు ధర తెలిస్తే... గుడ్లు తేలేస్తారు!

పాకిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న దయనీయ పరిస్థితుల గురించి చెప్పడానికి ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు తెరపైకి వచ్చాయి.

Update: 2023-12-26 08:45 GMT

పాకిస్థాన్ లో ప్రస్తుతం నెలకొన్న దయనీయ పరిస్థితుల గురించి చెప్పడానికి ఇప్పటికే ఎన్నో ఉదాహరణలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా కార్ల అమ్మకాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు అత్యంత దారుణంగా పడిపోయాయని.. దీంతో కంపెనీలు తమ తమ ప్లాంట్లు మూసేస్తున్నాయని కథనాలొస్తున్నాయి. కార్ల వరకూ ఎందుకు కోడి గుడ్డు గురించి చెప్పినా చాలు.. ప్రస్తుతం పాక్ లో నెలకొన్న దయణీయ పరిస్థితుల గురించి తెలియచెప్పడానికి అన్నట్లుగా ఉంది తాజా పరిస్థితి.

అవును... దాయాది దేశం పాకిస్తాన్‌ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఉదాహరణకు పౌష్టికాహరం కోసం తీసుకునే గుడ్డు సైతం అధిక ధరతో వెక్కిరిస్తుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ లో తాజాగా ఒక్క గుడ్డు ధర రూ.32కు చేరుకుంది. అంటే... కాస్త అటు ఇటుగా ఇండియాలో డజన్ గుడ్ల ధరకు పాక్ లో ఒక్క గుడ్డు వస్తుందన్నమాట.

వివరాళ్లోకి వెళ్తే... పాకిస్తాన్‌ లో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకుంటున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో గుడ్దు ధరలు సైతం భారీగ పెరిగాయి. ఇందులో భాగంగా... డజన్‌ గుడ్ల ధర అధికారికంగా ఏకంగా రూ.360కి చేరుకోవడం గమనార్హం. ఈ మేరకు పాకిస్తాన్‌ మీడియా వెల్లడించినట్లుగా కాస్త హోల్ సేల్ గా చూస్తే... 30 డజన్ల గుడ్ల ధర రూ.10,500 నుంచి రూ.12,500కు పెరిగిందని.. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తుంది.

పౌల్ట్రీ ఫీడ్‌ లో గుడ్డు ఉత్పత్తికి సోయాబీన్స్ కీలకంగా ఉంటుంది. ఈ సమయంలో సోయాబీన్స్‌ దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ.. ఇంకా నోటిఫికేషన్‌ జారీ కాలేదు. ఇదే సమయంలో మరోపక్క ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతున్నట్లు ఆల్‌ పాకిస్థాన్‌ బిజినెస్‌ ఫోరం తెలిపింది. దీంతో పౌల్ట్రీ ఫీడ్‌ సోయాబీన్స్ ధరల పెరుగుదల కూడా గుడ్డు ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది.

ఈ విషయాలపై స్పందించిన ఆల్ పాకిస్తాన్ బిజినెస్ ఫోరం ప్రెసిడెంట్‌ సయ్యద్ మాజ్‌ మహమూద్‌... యుఎస్ డాలర్‌ తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ దారుణంగా క్షీణించడం, మరోవైపు ఇంధన ఖర్చులు పెరగడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కాగా... ఇప్పుడు ఒక్క డాలర్ విలువ 279 పాకిస్థాన్ రూపాయలకు సమానం!

Tags:    

Similar News