కేంద్ర మాజీ మంత్రి ఓకే అంటే వైసీపీకి పండగే !

వైసీపీలో ఇన్ కమింగ్ కాల్స్ పలికి చాలా కాలం అవుతోంది అని బయట ఒక్కటే సెటైర్లు ఉన్నాయి.

Update: 2025-02-10 04:00 GMT

వైసీపీలో ఇన్ కమింగ్ కాల్స్ పలికి చాలా కాలం అవుతోంది అని బయట ఒక్కటే సెటైర్లు ఉన్నాయి. అంతా అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్ ఏదీ అని పార్టీలోనూ ఒక విధమైన నైరాశ్యం ఉంది. దాంతో వైసీపీ అధినాయకత్వం 2.0 చూస్తారు అని నమ్మకంగా చెప్పింది. దాని అర్ధమేంటి అంటే ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించి వైసీపీని బలోపేతం చేయడం.

ఆ విధంగా క్యాడర్ కి భరోసా ఇవ్వడం. వైసీపీకి అలా కనిపించేది కళ్ళ ముందు కాంగ్రెసే. ఆ పార్టీ నుంచే నేతలను తేవాలని డిసైడ్ అయినట్లుగా ఉంది. మొదటి బోణీ అనంతపురానికి చెందిన సాకే శైలజానాధ్ తో చేసింది. ఇక మీదట కాంగ్రెస్ నుంచే మరికొందరు బిగ్ షాట్స్ ని చేర్చుకోవాలని చూస్తోంది. ఆ లిస్ట్ లో కాకినాడకు చెందిన మాకీ కేంద్ర మంత్రి పళ్ళం రాజు ఉన్నారని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

పల్లం రాజుది సుదీర్ఘమైన రాజకీయ జీవితం. ఆయన 2004, 2009లలో రెండు సార్లు కాకినాడ లోక్ సభ సీటు నుంచి గెలిచి వచ్చారు. కేంద్రంలో కీలకమైన రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడైన నాయకుడు. గోదావరి జిల్లాలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు.

దాంతో ఆయనను చేర్చుకోవాలని వైసీపీ చూస్తోంది అని టాక్ ఉంది. ఈ విషయంలో బాధ్యతలను ఒక పెద్దాయనకు అప్పగించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆ పెద్దాయన బలమైన సామాజిక వర్గానికి నాయకత్వం వహించి కీలక నేతగా ఉన్నారు. ఆయన రాజకీయాల పట్ల కొన్నాళ్ళుగా వైముఖ్యంగా ఉన్నా తాజాగా మనసు మార్చుకున్నారని అంటున్నారు.

తానేంటో మరోసారి నిరూపించుకుని తన సత్తా చాటాకనే రాజకీయంగా పక్కకు తొలగాలని చూస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన ద్వారా కేంద్ర మాజీ మంత్రిని వైసీపీలోకి రప్పించే ప్రయత్నం జరుగుతోంది అని అంటున్నారు అయితే చాలా కాలంగా పళ్ళం రాజు రాజకీయంగా పెద్దగా సందడి చేయడం లేదు. ఆయన కాంగ్రెస్ లో కూడా కీలక పదవులు ఇచ్చినా నో చెప్పేశారు. ఆయన జాతీయ పార్టీలో ఉంటున్నారు. కాంగ్రెస్ కి విధేయుడిగానే ఉంటున్నారు. ఆయన కుటుంబం అంతా ఆ పార్టీనే నమ్ముకుని పనిచేసింది.

అయితే దేశంలో మారిన రాజకీయ ముఖ చిత్రంలో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోంది. అదే సమయంలో బీజేపీ బలం పుంజుకుంటోంది. దాంతో బీజేపీని నిలువరించే ప్రయత్నం చేయాలని అలాగే లౌకిక వాద అజెండాను బలపరచే శక్తులతో కలసి ముందుకు సాగాలని ఎక్కడికక్కడ ఆయా శక్తులను పటిష్టం చేయాలన్న చర్చ కూడా ఉంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ బలం లేని చోట మిగిలిన సెక్యులర్ ఫోర్సెస్ ని బలోపేతం చేస్తూ తద్వారా ఇండియా కూటమిని కేంద్రంలో గట్టిగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరుగుతోంది అని అంటున్నారు. ఏపీలో చూస్తే కాంగ్రెస్ ఇబ్బందులో ఉంది. అందువల్ల బీజేపీకి కూటమికి ఆల్టరేషన్ గా వైసీపీని కాంగ్రెస్ వాదులు ఎంచుకుని జాతీయ స్థాయిలో ఎన్డీయే వ్యతిరేక శిబిరానికి బలం ఇవ్వాలనుకుంటే మాత్రం ఈ ప్రయత్నాలు ఫలించినట్లే అంటున్నారు.

వైసీపీలో చేరిన శైలజానాధ్ కూడా కాంగ్రెస్ భావజాలం వైసీపీలో ఉందని అందుకే చేరామని చెబుతున్నారు. మరి పల్లం రాజు కనుక వైసీపీలో చేరితే ఆ పార్టీకి కొండంత బలం చేకూరినట్లే అంటున్నారు. గోదావరి జిల్లాలలో కూడా కొత్త శక్తి వస్తుందని అంటున్నారు. మరి పుకార్లుగా వ్యాపిస్తున్న ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలియాలంటే వేచి చూఒడాల్సిందే.

Tags:    

Similar News