పందెంలో ఓడి చనిపోయిన కోడికి రూ.1,11,111!

ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ముగిసి రెండు మూడు రోజులు అవుతున్నా.. ఆ సంబరాల్లోని కోడి పందేలకు సంబంధించిన వైరల్ ఇష్యూస్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

Update: 2025-01-18 08:01 GMT

ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు ముగిసి రెండు మూడు రోజులు అవుతున్నా.. ఆ సంబరాల్లోని కోడి పందేలకు సంబంధించిన వైరల్ ఇష్యూస్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా... ఈ సంక్రాంతి పందేల్లో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు రూ.2,200 కోట్ల వరకు చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. రూ.కోట్ల మద్యాన్ని తాగారని అంటున్నారు.

ఇక... కోడిపందేలకు డబ్బులు పలువురు కాయగూరల సంచుల్లో తీసుకొచ్చిన విషయాలు వైరల్ గా మారాయి. పైగా ఈసారి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మారిన కోడి పెందేల పరిసరాల్లో గుండాటతో పాటు మరికొన్ని జూద క్రీడలు ఏర్పాటు చేయడంతో డబ్బు ప్రవాహం పెరిగిందని అంటున్నారు. ఈ సమయంలో 'పందెంలో ఓడిపోయి చనిపోయిన కోడికి లక్ష' అనే విషయం వైరల్ గా మారింది.

అవును... సాధారణంగా పందేంలో పాల్గొనబోయే కోడిపై లక్షలు, కోట్ల రూపాయలు పందేలు కాయడం తెలిసిందే! అయితే.. రొటీన్ కి భిన్నంగా అన్నట్లుగా.. పందెంలో చనిపోయిన పుంజును కూడా లక్ష రూపాయలు పైన వెచ్చించి కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెస్ట్ గోదావరి జిల్లాలో వెలుగు చూసింది.

ఇందులో భాగంగా... ఏలూరు ఎన్.ఆర్.పేటకు చెందిన ఆహ్లాద్, రాజవంశీ, రాజేంద్ర పందెం పుంజును పెంచారు. అయితే.. ఆ కోడి గురువారం నాడు జరిగిన పందెంలో పోరాడి ఓడిపోయిందంట. అయితే... ఆ పుంజు పోరాట పటిమను పదిమందికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో శుక్రవారం దాన్ని వేలం వేశారు. ఆసక్తి ఉన్నవాళ్లు అందరూ పాల్గొనవచ్చని ప్రకటించారు.

ఈ సమయంలో... ఆ కోడిని కోసి, కాల్చి వేలాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదే ఏలూరులోని జాలిపూడికి చెందిన మాగంటి నవీన్ చంద్రబోస్ ఈ కోడిని దక్కించుకున్నారు. అందుకు ఆయన వెచ్చించిన మొత్తం అక్షరాలా రూ.1,11,111 కావడం గమనార్హం. ఈ విషయాన్ని నవీన్ ఇన్ స్టాలో పంచుకోగా.. ఇష్యూ వైరల్ గా మారింది.

Tags:    

Similar News