పార్లమెంటు 'వాయిదాల' సమావేశాలు: నెటిజన్ల సటైర్లు విన్నారా?
దేశ ప్రజలకు విజ్ఞప్తి.. ప్రస్తుతం జరుగుతున్నవి పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు కాదు.. వాయిదాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేళాలపై దేశవ్యాప్తంగా ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. టమాల ధరల నుంచి జీఎస్టీ బాదుడు వరకు.. నిత్యావసరాల మంట నుంచి గ్యాస్ సిలెండర్ మంటల వరకు ఏమైనా చర్చిస్తారా? ఏమైనా ఉపశమనం కలిగిస్తారా? అంటూ.. ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమ య్యాయి.
కానీ, ఏం ఫలితం? సభలు ప్రారంభమై రెండు రోజులు గడిచినా.. వాయిదాల పర్వంతో సాగుతోంది. ఉద యం వాయిదా.. మధ్యాహ్నం.. వాయిదా.. సాయంత్రం వాయిదా.. దీంతో పార్లమెంటు వాయిదాల సభగా మారిపోయింది.
ఈ పరిణామాలను గమనించిన నెటిజన్లు.. "దేశ ప్రజలకు విజ్ఞప్తి.. ప్రస్తుతం జరుగుతున్నవి పార్లమెంటు వర్షాకాలు సమావేశాలు కాదు.. వాయిదాల సమావేశాలు" అని కామెంట్లుపెడుతున్నారు.
మరికొందరు అయితే.. 'వాయిదాల' సమావేశాల్లో ఏవో జరుగుతాయని, తమకేదో మేలు జరుగుతుందని ఆశలు పెట్టుకున్నవారు ఆయా ఆశలను, ఆలోచనలను 'వాయిదా' వేసుకోండి! అని సటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం వాయిదాల సభలో మణిపూర్ తప్ప.. మిగిలిన అంశాలేవీ.. ప్రతిపక్షాలకు కనిపించడం లేదని మరికొందరు ఎద్దే వాచేస్తున్నారు.
అలాగని మణిపూర్‌లో జరిగి అమానవీయ ఘటనను ఎవరూ తక్కువ చేయడం లేదు. కానీ, దేశంలోని 140 కోట్ల మంది అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించడం లేదని మాత్రం వ్యాఖ్యానిస్తున్నారు.
తాజాగా గురువారం నుంచి ప్రారంభమైన.. పార్లమెంటు సమావేశాలు తొలి రోజు నుంచి మణిపూర్‌లో జరిగిన అమానవీయ ఘటన సహా 75 రోజులుగా అక్కడ జరుగుతున్న అల్లర్లపైనే అట్టుడుకుతోంది. దీంతో ఈ విషయాన్నే విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి.
అయితే, నిబంధనల పేరుతో ముందుకు రావాలని.. స్పీకర్, చైర్మన్‌లు చెబుతున్నారు. మొత్తానికి గురువారం, శుక్రవారం కూడా సభలు పదే పదే వాయిదా పడ్డాయి. కనీసం ఒక్క అంశంపైనా చర్చసాగలేదు. ఈ విషయంపైనే నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు.