తన గెస్ట్ హౌస్ పై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు.. కేటీఆర్ పై సెటైర్లు!

ఈ నేపథ్యంలో.. ప్రధానంగా చెరువులకు సమీపంలో బీచ్ వ్యూ ఎఫెక్ట్ కో సం అన్నట్లుగా గెస్ట్ హౌస్ లు నిర్మించిన పెద్దలు వణికిపోతున్నారని అంటున్నారు.

Update: 2024-08-27 08:26 GMT

తెలంగాణ రాజకీయాల్లో ఏ ఒక్కరిని కదిపినా, ఏ ఇద్దరు కలిసినా వారి మధ్య.. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడుతున్న వ్యవహారంపైనే చర్చ వస్తుందన్నా అతిశయోక్తి కాదేమో. ప్రస్తుతం హైడ్రా వ్యవహారం అంత హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకుల గెస్ట్ హౌస్ లకు స్ట్రోక్ తప్పదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. ప్రధానంగా చెరువులకు సమీపంలో బీచ్ వ్యూ ఎఫెక్ట్ కో సం అన్నట్లుగా గెస్ట్ హౌస్ లు నిర్మించిన పెద్దలు వణికిపోతున్నారని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా.. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. తన గెస్ట్ హౌస్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు! ఇదే క్రమంలో తన గెస్ట్ హౌస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే కూల్చేయొచ్చని అన్నారు!

అవును... హైదరాబాద్ నగరంలోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న వ్యవహారాలపై కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి స్పందించారు. హిమాయత్ సాగర్ లోని ఎఫ్.టీ.ఎల్.లో గెస్ట్ హౌస్ కట్టారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. దానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తాజాగా తన గెస్ట్ హౌస్ పై వస్తోన్న ఆరోపణలపై మీడియా సమావేశం పెట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మాజీమంత్రి పట్నం మహేందర్ రెడ్డి... చెరువులను పరిరక్షించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఇక కొత్వాల్ గూడలో 14 ఎకరాల 14 గుంటలు ఉందని.. అది తన కుమారుడి పేరు మీద ఉందని.. 2005లో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా అన్ని అనుమతులతోనూ చిన్నగా గెస్ట్ హౌజ్ కట్టుకున్నామని తెలిపారు.

అయితే నాడు తాము కట్టుకున్న గెస్ట్ హౌస్.. హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వానికి సహకరించి తామే కూల్చేస్తామని తెలిపారు. తమ గెస్ట్ హౌస్ వద్ద తోటలు, పశువులను పెంచుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నట్లు చెప్పిన పట్నం... అది పట్టా భూమని, చాలా స్పష్టంగా అన్ని నిబంధనలు పాటించినట్లు తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని అన్నారు.

ఇదే క్రమంలో... తమ భవనం ఎటువంటి బఫర్ లోన్ లో కానీ, ఎఫ్.టీ.ఎల్. పరిధిలో కానీ లేదని... అక్కడకు సమీపంలో చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయని.. ఈ పూర్తి వివరాలు తెలియకుండానే కేటీఆర్ మాట్లాడుతున్నారని పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు. 111 జీవో పరిధిలో చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇళ్లు నిర్మించుకున్నారని అన్నారు.

Tags:    

Similar News