తనను ఎంపీగా గెలిపించకపోతే ప్రజలకే నష్టం... పాల్ మ్యాజికల్ వర్డ్స్!

వాటన్నింటికీ కారణం ఎవరనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఆయన వన్ అండ్ ఓన్లీ కేఏ పాల్! ఈ క్రమంలో తాజాగా మరోసారి అత్యంత మ్యాజికల్ వర్డ్స్ వదిలారు!

Update: 2023-11-17 02:30 GMT

నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు అని కొందరంటే... ఇంత సీరియస్ రాజకీయాల్లో ఆమాత్రం ఎంటర్ టైన్ మెంట్ లేకపోతే ఎలా అని మరికొందరు ప్రశ్నిస్తూ వెనకేసుకొస్తుంటారు. వాటన్నింటికీ కారణం ఎవరనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! ఆయన వన్ అండ్ ఓన్లీ కేఏ పాల్! ఈ క్రమంలో తాజాగా మరోసారి అత్యంత మ్యాజికల్ వర్డ్స్ వదిలారు!

అవును... విశాఖ ఎంపీగా తనను గెలిపించకపోతే రాష్ట్రం ఉండదు, దేశమూ ఉండదు.. అక్కడి నుంచి తనను ఎంపీగా గెలిపించకపోతే ప్రజలకే నష్టం అని అంటున్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌. పైగా తనను నమ్మితే తనకు ఓట్లు వేయమని.. లేకపోతే మానేయమని.. ఇదే ప్రజలకు చివరి అవకాశం అని, ఇకపై దేవుడు కూడా మరో ఛాన్స్ ఇవ్వడని చెప్పుకొచ్చారు పాల్.

అదే సమయంలో విశాఖ నుంచి తాను ఎంపీగా పోటీ చేస్తే అన్ని పార్టీలు పోటీ చేయడం మాన్సేసి తనకు మద్ధతు ఇస్తాయంటూ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. ఇందులో భాగంగా... ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ పోటీ చేయడం లేదని, అటు టీడీపీ అభ్యర్థి భరత్ కూడా పాల్ విశాఖ ఎంపీ అయితే బాగుంటుందని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసిందని వ్యాఖ్యానించడం కొసమెరుపు!

ఇదే సమయంలో తాను పార్లమెంట్ కి వెళ్లకపోతే ఇండియా.. సూడాన్, శ్రీలంకలాగా అయిపోతుందని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కలుస్తానని చెప్పుకొచ్చిన పాల్... పవన్ కల్యాణ్ లాంటి ప్యాకేజీ స్టార్ ల గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవద్దని, తనతో కలిసి పని చేస్తూ, పోరాడితే దేవుని దీవెనలు, తన దీవెనలు ఉంటాయని చెప్పుకొచ్చారు.

అదే విధంగా... ఈవీఎం లను వాడుకుంటూ డిపాజిట్ లు రాని క్యాండిడెట్లను గెలిపించుకుంటున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవాలని చెప్పిన పాల్... ఏపీలో బీజేపీ ఉందా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో పురందేశ్వరి పోటీ చేశారని, 36000 ఓట్లు వచ్చాయని.. ఈ లెక్కన జీవీఎల్ పోటీ చేస్తే 3600 వస్తాయని ఎద్దేవా చేశారు.

అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ను అమెరికా చేస్తానన్న తన మాటను నిలబెట్టుకున్నానని ఈ సందర్భంగా చెప్పిన కేఏ పాల్... పార్లమెంటులో ప్రధాని మోడీని ఎదుర్కొనే దమ్ము తనకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలా మాట్లాడటానికి కూడా ధైర్యం ఉండాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News