యాంటీ సెంటిమెంట్ ... పవన్ అందుకే ఖాళీ చేశారా ?

ఆయన ఈ పదవిని స్వీకరించాక ఆయనకు క్యాంప్ ఆఫీసుగా విజయవాడలోని జలవనరుల శాఖకి చెందిన కార్యాలయం కేటాయించారు.

Update: 2024-09-12 22:30 GMT

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా జనసేన ఉంది. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన ఈ పదవిని స్వీకరించాక ఆయనకు క్యాంప్ ఆఫీసుగా విజయవాడలోని జలవనరుల శాఖకి చెందిన కార్యాలయం కేటాయించారు.

అక్కడ అంతా బాగుందని పవన్ అనుకున్నారు. తనకు తగినట్లుగా ఏర్పాట్లు చేయించుకున్నారు. కొన్నాళ్ల పాటు అక్కడే ఆయన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. టాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులతో భేటీ కూడా అక్కడే జరిపారు. పవన్ ఆ విధంగా కొన్నాళ్ల పాటు ఆ ఆఫీసుని ఉపయోగించుకున్నారు

అయితే ఇటీవల కాలంలో ఆయన అక్కడికి వెళ్ళడం తగ్గించారు. మంగళగిరిలోని తన నివాసంలో పార్టీ క్యాంప్ ఆఫీసుగా మార్చుకుని అక్కడే సమీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సడెన్ గా తనకు ప్రభుత్వం ఇచ్చిన విజయవాడలోని జలవనరుల క్యాంప్ ఆఫీసుని సరెండర్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నారు.

ఈ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. తనకు వేరేగా క్యాంప్ ఆఫీసు ఉన్నందు వల్ల విజయవాడ క్యాంప్ ఆఫీసు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో తనకు విజయవాడలో విశాలమైన క్యాంప్ ఆఫీసుని ఇచ్చినందుకు ప్రభుత్వానికి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియచేశారు. దాంతో మొత్తం ఫర్నించర్ తో సహా భవనాని ప్రభుత్వానికే ఇస్తున్నట్లుగా ఆయన లేఖలో తెలిపారు.

పవన్ ఇలా ఎందుకు చేశారు అన్న దాని మీద చర్చ సాగుతోంది. అయితే ఈ జలవనరుల శాఖ భవనాన్ని గతంలో క్యాంప్ ఆఫీసుగా వాడుకున్న వారు అంతా మాజీలు అయ్యారు. అంతే కాదు రాజకీయంగా కను మరుగు అయ్యారు. వైసీపీ ఏలుబడిలో ఈ భవనాన్ని మొదట అప్పటి జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వాడుకున్నారు. ఆ తరువాత ఆయన మాజీ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిన తరువాత ఆయన ఎలా ఉన్నారో కూడా తెలియదు అని అంటున్నారు

ఇక విద్యా శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు ఈ భవనం క్యాంప్ ఆఫీసుగా ఇచ్చారు. అయితే ఆయన తనకు కంచుకోట లాంటి చీపురుపల్లిలో ఓటమి పాలు అయ్యారు. అయితే ఇటీవలే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు అది వేరే విషయం కానీ రాజకీయంగా మాత్రం ఎవరు పెద్దగా ఎత్తి గిల్లింది లేదు అన్న నెగిటివ్ సెంటిమెంట్ ఈ క్యాంప్ ఆఫీసు కి ఉంది.

అందుకే ఈ యాంటీ సెంటిమెంట్ కారణంగానే పవన్ కళ్యాణ్ బ్రహ్మాండమైన విశాలమైన ఈ క్యాంప్ ఆఫీసుకుని వదులుకుంటున్నారా అన్న చర్చకు వస్తోంది. ఇది హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది. గవర్నర్ పేటలో ఇంతటి పెద్ద ఆఫీసు దొరకడం కష్టమే. అందరికీ అన్ని విధాలుగా అందుబాటులో ఉండే ఈ క్యాంప్ ఆఫీసుకి ఇటీవల కాలంలో పవన్ రాకపోకలు తగ్గించేశారు. ఇపుడు ఆయన ఏకంగా వదిలేసుకున్నారు.

ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన బాధ్యతలను చాలా చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నా అనుకున్నంతా ఆయనకు ఎలివేషన్ రాలేదు అన్న చర్చ కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి ఎవరు ఎందుకు చెప్పారో లేక నిజంగా ఈ భవనం అవసరం లేదు అనుకున్నారో కానీ పవన్ కేవలం మూడు నెలల వ్యవధిలోనే ప్రభుత్వానికి తిరిగి సరెండర్ చేయడం మాత్రం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News