వాలంటీర్లపై తేల్చేసిన పవన్... ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ సూచన!

తాజాగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సర్పంచుల సంఘాల ప్రతినిధులతో సమావేశం అయిన పవన్... ఈ సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-07 12:03 GMT

గత ప్రభుత్వ హయాంలో ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తొలుత ప్రభుత్వానికి, సంక్షేమ పథకాల లబ్ధిదారులకూ మధ్య వారదిగా వాలంటీర్లు పనిచేస్తున్నారనే కామెంట్లు వినిపించేవి. అయితే... ఏపీలో మహిళల హ్యూమన్ ట్రాఫికింగ్ లో వాలంటీర్ల పాత్ర కూడా ఉందంటూ పవన్ చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది.

అయితే.. తర్వాత కాలంలో వాలంటీర్లకు తమ ప్రభుత్వం వస్తే రూ.10,000 జీతం పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ల పంపిణీ బాధ్యతను గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. దీంతో... ఇప్పుడు ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉందా.. లేదా.. అనే విషయం సమాధానం లేని ప్రశ్నగా మారిన వేళ పవన్ సమాధానం చెప్పారు!

అవును... ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ ఉందా.. లేదా.. అనే ప్రశ్నలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టమైన సమాధానం చెప్పారు. తాజాగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సర్పంచుల సంఘాల ప్రతినిధులతో సమావేశం అయిన పవన్... ఈ సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారికి ప్రభుత్వానికి ఉన్న సంబంధంపై క్లారిటీ ఇచ్చారు!

ఇందులో భాగంగా... వాలంటీర్లు సమాంతర వ్యవస్థగా మారినట్లు తన దృష్టికి చాలా మంది తీసుకొచ్చారని పవన్ చెప్పారు. ఈ సందర్భంగా... గ్రామ సచివాలయ వ్యవస్థను పంచాయతీలో విలీనం చేయాలని, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని కోరారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే.. గత ప్రభుత్వ వాళ్లను మోసం చేసిపెట్టుకుందని పవన్ తెలిపారు.

ఈ ప్రభుత్వం వారికి జీతాలు పెంచుదామని చూస్తున్నప్పటికీ.. జీవీల్లో వాళ్లు ఎక్కడా లేరని, వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను చాలా అన్యాయంగా మోసం చేసిందని, ఈ మెసేజ్ ను కూడా తీసుకెళ్లాలని అన్నారు. ఇక.. వాలంటీర్లను రద్దు చేయమంటున్నారు.. రద్దు చేయడానికి వళ్లు అసలు ఉన్నారా? అని అన్నారు.

ఇలా... ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా గ్రామ వాలంటీర్ల అంశమే లేదని.. అసలు ఉద్యోగాల్లోనే లేరంటే రద్దు అంశం ఎక్కడుందని పవన్ చెప్పడంతో.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ పూర్తి క్లారిటీ ఇచ్చేసినట్లే అని అంటున్నారు పరిశీలకులు!

Full View
Tags:    

Similar News