దీపావళి వేళ పవన్ కల్యాణ్ సంచలన ట్వీట్.. వైరల్ వీడియో!
దీపావళి పర్యదినం సందర్భంగా... భారత్ - పాక్ విభజనకు సంబంధించి బాధతో ఓ బాలుడు పాడిన పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు పవన్ కల్యాణ్.
దీపావళి పండుగ సందర్భంగా దేశంలో దీపావళి సంబరాలు అంబరన్ని అంటున్నాయి. ఇదే సమయంలో... విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా అమెరికా, బ్రిటన్ దేశల్లోనూ దీపావలి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సమయంలో పక్కనున్న పాకిస్థాన్ , బంగ్లాదేశ్ లోని హిందువుల విషయాలను ప్రస్థావించారు పవన్ కల్యాణ్.
అవును... గత కొన్ని రోజులుగా పక్కనున్న పాకిస్థాన్, బంగ్లాదేశ్ లోని హిందువులు పడుతున్న ఇబ్బందుల గురించిన వార్తలు మీడియాలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... దక్షిణ సింధ్ ఫ్రావిన్స్ లో నివసిస్తున్న హిందూ సమాజానికి చెందిన వారిని బెదిరిస్తున్నారని.. వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. దీంతో వారంతా భయం గుప్పిట్లో జీవిస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో... బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ ఉన్న హిందువుల కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయని.. అక్కడ జరిగే అతిపెద్ద హిందూ పండుగ గురించి పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. హిందువులను బెదిరిస్తూ, దుర్గా విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని అక్కడ హిందూ సంఘాల సభ్యులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఆసక్తికరంగా స్పందించారు. దీపావళి పర్యదినం సందర్భంగా... భారత్ - పాక్ విభజనకు సంబంధించి బాధతో ఓ బాలుడు పాడిన పాటకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు పవన్ కల్యాణ్. ఈ చిన్నారి పాటలో దేశ విభజన కారణంగా కలిగిన బాధ స్పష్టంగా కనిపించిందని అన్నారు.
ఈ సందర్భంగా... "ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ఆ శ్రీరాముడు మీకు ధైర్యాన్ని, శక్తిని ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను" అని పవన్ కల్యాణ్ స్పందించారు. ఇదే సమయంలో... "మీ భద్రత కోసం భారత్ లోని ప్రతీ ఒక్కరం ఎదురుచూస్తున్నాం" అని తెలిపారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో హిందువుల భదరత, ప్రాథమిక హక్కులు అణిచివేతకు గురవుతున్నాయని తెలిపారు.
ఈ సమయంలో ఆ రెండు దేశాల్లో అణిచివేతకు గురవుతున్న హిందువుల భద్రత, ప్రాథమిక హక్కుల కల్పన కోసం యావత్ ప్రపంచం, ప్రపంచనేతలు కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... వారి కోసం మనమంతా ప్రార్థిద్దామని పవన్ కల్యాణ్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా... పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో ఉన్న హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు!