డబుల్ ప్లాన్స్ లో పవన్?

ఇపుడు 21 సీట్లకు 21 సీట్లూ గెలుచుకునే సామర్ధ్యం జనసేనకు ఉందని తేల్సింది. అంతే కాదు జనసేన బలపడేందుకు కొత్త జిల్లాల నుంచి నేతలను ఆకర్షిస్తున్నారు.

Update: 2024-09-21 03:51 GMT

ఏపీలో టీడీపీ కూటమిలో పవన్ కి ప్రాధాన్యత బాగానే ఉంది. అదే సమయంలో ఆయన కీలకమైన శాఖలనే చూస్తున్నారు. ఇదిలా ఉంటే కూటమిలో టీడీపీలోకి చేరికలు ఎక్కువగా సాగుతున్నాయి. వైసీపీ నుంచి వస్తున్న వలసలు అన్నీ సైకిలెక్కేస్తున్నాయి. జనసేనలోకి పెద్దగా రావడం లేదు అన్న మాట ఉంది.

దాంతో ఇపుడు పవన్ గేరు మార్చి స్పీడ్ పెంచారు అని అంటున్నారు. టీడీపీ కూటమిలో ముఖ్య భాగస్వామిగా ఉంటూనే కీలకమైన జిల్లాలలో బలం పెంచుకునే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు. గోదావరి జిల్లాలలో ఇటీవల ఒక జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మొదట జనసేనలోకి వెళ్తామని చెప్పి ఆ తరువాత సైకిలెక్కేశారు.

దాంతో పవన్ కూడా అలెర్ట్ అయ్యారు అని అంటున్నారు. మిత్రులుగా ఎంత ఉన్నా ఎవరి రాజకీయం వారిది అని అంటున్నారు. వైసీపీ నుంచి వస్తున్న నాయకులను తాము మాత్రం ఎందుకు చేర్చుకోకూడదు అన్న ఆలోచనతో జనసేన సైతం గేట్లు తెరిచింది అని అంటున్నారు. దాని ఫలితంగానే ప్రకాశం జిల్లాలో బిగ్ షాట్ గా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వచ్చారు అని అంటున్నారు.

పైగా ఆయన జగన్ కి దగ్గర బంధువు. దాంతో వన్ షాట్ టూ బర్డ్స్ అన్నట్లుగా వైసీపీని వీక్ చేయడం మోరల్ గా కూడా దెబ్బ తీయడం జరిగింది అని అంటున్నారు. దాంతో పాటు కృష్ణా జిల్లాలో కూడా మరో కీలక నేతను జనసేన తన వైపు తిప్పుకుంది. సామినేని ఉదయభాను వైసీపీని వీడి జనసేన వైపు వస్తున్నారు. దీంతో ఆ జిల్లాలో జనసేనకు జోష్ పెరిగింది. ఈ ఇద్దరు నేతల వెనక మెగా బ్రదర్స్ పాత్ర కూడా ఉంది అని అంటున్నారు.

జనసేన ఎందుకు ఇలా ఒక్కసారిగా తన స్ట్రాటజీ మార్చింది అంటే ముందస్తు వ్యూహమే అని అంటున్నారు. రేపటి రోజున ఎటు నుంచి పోయి ఏమి జరిగినా తన బలాన్ని పెంచుకుంటే దానికి తగినట్లుగా రాజకీయ వాటా ఉంటుందని ఆలోచనతొనే ఇదంతా అని అంటున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ ఒక మాట చెబుతూ ఉండేవారు. మన బలం ఎంతో తెలిస్తే వచ్చేసరికి మరింత డిమాండ్ చేయగలమని.

ఇపుడు 21 సీట్లకు 21 సీట్లూ గెలుచుకునే సామర్ధ్యం జనసేనకు ఉందని తేల్సింది. అంతే కాదు జనసేన బలపడేందుకు కొత్త జిల్లాల నుంచి నేతలను ఆకర్షిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి రోజున ముందస్తు ఎన్నికలు వచ్చినా లేక అయిదేళ్ళకు షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు వచ్చినా జనసేన ఇంతకు ఇంతా తన సీట్లను పెంచుకోవడానికి డిమాండ్ చేసేందుకు వీలు ఉంటుంది అని అంటున్నారు. ఒక వేళ ఆనాటి పరిస్థితులు వేరే విధంగా ఉన్నా కూడా సొంతంగా బలపడేందుకు కూడా అవకాశం ఉంటుంది అని అంటున్నారు.

వైసీపీ ఏపీలో ఇంకా బలహీనపడలేదు. ఆ పార్టీ బలహీనపడితే మాత్రం ఆ పొలిటికల్ స్లాట్ లోకి వెళ్లడానికి జనసేన ఏ మాత్రం ఆలోచించదని వేగంగానే జంప్ చేస్తుందని అంటున్నారు. అపుడు కూడా ఏపీలో రెండు పార్టీలు ఉంటాయి. ఆ రెండూ ప్రాంతీయ పార్టీలే అవుతాయి. అలా ఏపీ పొలిటికల్ సినేరియో తనకు అనుకూలంగా మార్చుకోవడానికే జనసేన చూస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి జనసేన డబుల్ ప్లాన్స్ కొత్త వ్యూహాల పర్యవశానాలు ఎలా ఉంటాయో.

Tags:    

Similar News