పవన్ ఇంకా హ్యాపీగా లేరా ?
అయితే వారిని అరెస్ట్ చేసినా నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టకుండా బెయిల్ వచ్చేలా కేసులు పెడుతున్నారు. దాంతో వారు అరెస్ట్ అయినా బయటకు వచ్చేస్తున్నారు.
ఏపీలో టీడీపీ కూటమిలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు అయింది. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ ని ఎంతో గౌరవంగా చూసుకుంటారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీ పెద్దలు పవన్ ని తమ సన్నిహితుడిగా భావిస్తారు.
ఇలా దేశంలో చూసినా ఏపీలో చూసినా పవన్ రాజకీయంగా అధికారికంగా అత్యంత బలవంతుడుగా ఉన్నారు. ఆయన తలచుకోవాలే కానీ ఆయన మాట చలామణీ అయి తీరుతున్న సందర్భం ఇది. ఇలా విశేషంగా అధికారాలు కలిగి ఉండి పవన్ గత అయిదు నెలల పాలనలో హ్యాపీగా లేరా. మరీ ముఖ్యంగా సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆయన పర్యటించినపుడు ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టేశారు.
హోం శాఖ పనితీరు మార్చుకోవాలని సూచించారు. లేదా తానే ఆ పదవిలోకి వస్తాను అని కూడా ఒక బలమైన సంకేతాలు పంపించారు. ఈ నేపథ్యంలో డీజీపీ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. హోం మంత్రి వంగలపూడి ఒకటికి మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి ఇది ప్రజా ప్రభుత్వం పవన్ చేసిన సూచనలను అన్నీ పాజిటివ్ గా తీసుకుంటామని ఏపీలో పకడ్బందీగా లా అండ్ ఆర్డర్ ని నిర్వహిస్తామని కూడా ప్రకటించారు.
అంతే కాదు పవన్ తో హోం మంత్రి అనిత భేటీ అయి అన్ని విషయాలూ చర్చించారు. వాటిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే మీడియా ముఖంగానూ చెప్పారు. ఇక పవన్ ఏ విధంగా ఏపీలో హోం శాఖ పనితీరుని చూడాలని అనుకుంటున్నారో ఆయన చెప్పినట్లుగానే అన్నీ అమలు చేస్తామని కూడా పేర్కొన్నారని అంటున్నారు.
ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం మీద అలాగే మెగా ఫ్యామిలీ మెంబర్స్ మీద ఇలా చాలా మందిని వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్న వారి మీద కఠిన చర్యలకు ప్రభుత్వం దిగింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా వరసబెట్టి అరెస్ట్ చేస్తోంది.
అయితే వారిని అరెస్ట్ చేసినా నాన్ బెయిల్ బుల్ కేసులు పెట్టకుండా బెయిల్ వచ్చేలా కేసులు పెడుతున్నారు. దాంతో వారు అరెస్ట్ అయినా బయటకు వచ్చేస్తున్నారు. దీని వల్ల ఏమి లాభం అన్న చర్చ అయితే వస్తోంది. మరో వైపు చూస్తే కనుక కఠినమైన శిక్షలు వారికి వేస్తే తప్ప ఈ ఆగడాలు అగవని అంటున్నారు.
ఆ విధంగా చేయాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న చట్టాల మేరకు అంతే జరుగుతోంది. దాంతోనే పవన్ ఈ రకమైన చర్యల పట్ల అంతగా హ్యాపీగా లేరు అన్న చర్చ అయితే నడుస్తోంది. అయితే పవన్ కోరుకున్నట్లుగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అసభ్య పదజాలంతో మాట్లాడేవారిని పట్టుకుని కఠిన దండన విధించాలీ అంటే కొత్తగా చట్టాలను తీసుకుని రావాల్సి ఉంటుంది.
ఆ విధంగా చేస్తామని కూడా కూటమి ప్రభుత్వం చెబుతోంది. అదే జరిగితే కచ్చితంగా నాన్ బెయిల్ బుల్ కేసులు పడతాయి. మరి అంతవరకూ పవన్ హ్యాపీగా ఉండగలరా అంటే ఏమో అన్నదే జవాబుగా వస్తోంది. మొత్తానికి పవన్ లో ఆవేశాన్ని ఏపీ అంతా చూసింది. కానీ హోం శాఖ పరిధిలో తీసుకుంటున్న చర్యలు మాత్రం ఆయనకు పూర్తి సంతృప్తిని ఇస్తున్నాయా అంటే పవన్ కళ్యాణ్ పూర్తి సంతోషంగా లేరు అని గ్రామాలలో అనుకుంటున్నారు అని చెబుతున్నారు. మొత్తానికి పవన్ అయితే ఆగ్రహంతో ఉన్నారా అంటే ఏమో రానున్న రోజులలో జరిగే పరిణామాలే దానికి జవాబు చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు.