'రాళ్లు, రప్పల మధ్య నగరాన్ని చూడగల దార్శనికుడు'... బాబుపై పవన్ మరోసారి!

అవును... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో.. అధికారులు, బ్ర్యూరోక్రాట్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-11 11:09 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఇందులో భాగంగా భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్ధేశంతో పాటు 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సమీక్షిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో.. అధికారులు, బ్ర్యూరోక్రాట్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ప్రజలు తమను విశ్వసించి భారీ విజయం కట్టబెట్టారని.. ప్రజలు తమ నుంచి ఆలా ఆశిస్తున్నారని పవన్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో.. ప్రజలకు ఉపయోగపడే పాలసీలు తము చేయగలమని, అయితే.. విధానాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత అధికారులదే అని పవన్ అన్నారు. గత ప్రభుత్వం అధికారులను చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందని పవన్ చెప్పడం గమనార్హం.

అయితే... చంద్రబాబు వంటి డైనమిక్ లీడర్ నాయకత్వంలో.. సమిష్టి కృషితో ఏపీ పునర్నిర్మాణం దిశగా ముందుకు పోతోందని చెప్పిన పవన్... రాళ్లు, రప్పలతో ఉన్న భూములను చంద్రబాబు ఓ మహా నగరంగా మార్చారని, హైటెక్ సిటీ నిర్మించారని ప్రశంసించారు. గొప్ప పాలనాదక్షత ఉన్న లీడర్ మనకు ఉండటం మన బలమని కొనియాడారు!

ఇక కానినాడ పోర్టులో స్మగ్లింగ్ వ్యవహారం ఆందోళన కలిగించిందని చెప్పిన పవన్.. కసబ్ వంటి వారు ఈ సీపోర్ట్ ద్వారా దేశంలోకి చొరబడినా ఆశ్చర్యం లేదని చెప్పుకొచ్చారు. ఐఏఎస్ లు, బ్యూరోక్రాట్లు స్వేచ్ఛగా, సమర్ధవంతంగా పనిచేసి వ్యవస్థలను బలోపేతం చేయాలని, పాలనను గాడిలో పెట్టాలని కోరారు.

ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... 2027లోపు పోలవరం పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనె అని అన్నారు. ఇక దీపం-2 పథకం కిదం ఇప్పటికే 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చినట్లు బాబూ తెలిపారు. త్వరలో టీచర్ పోస్టుల భర్తీ ఉంటుందని అన్నారు.

Tags:    

Similar News