పవన్ డెసిషన్ కి ఫుల్ సపోర్ట్!

ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఒక పాలసీ డెసిషన్ కి ఏకగ్రీవంగా మొత్తం సమాజం నుంచి మద్దతు దక్కుతోంది.

Update: 2024-11-15 09:43 GMT

ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఒక పాలసీ డెసిషన్ కి ఏకగ్రీవంగా మొత్తం సమాజం నుంచి మద్దతు దక్కుతోంది. ఇంతకీ ఆ డెసిషన్ ఏమిటి పవన్ ఏమిటి చెప్పారు, ఆయన చేసిన ఆ ప్రతిపాదిత విధాన ప్రకటన ఏమిటి అన్నది కనుక చూస్తే ఏపీ శాసన సభలో గురువారం జరిగిన ప్రొసీడింగ్స్ లోకి వెళ్లాలి.

పవన్ కళ్యాణ్ సభలో డిప్యూటీ స్పీకర్ గా రఘురామ క్రిష్ణం రాజుని అభినందించే కార్యక్రమంలో మాట్లాడుతూ సోషల్ మీడియా పోస్టింగుల మీద కీలక వ్యాఖ్యలు చేశారు. భావ ప్రకటన స్వేచ్చకు హద్దు ఉండాలని, అయితే అది హద్దులు దాటుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా పేరిట అనుచిత అసభ్యకరమైన పోస్టింగులు పెట్టే సైకో శాడిస్టిక్ నేచర్ ఎక్కువ అయిందని ఆయన అన్నారు. అంతే కాదు తల్లిని చెల్లిని కుటుంబంలోని మహిళలను సైతం చూడకుండా విచ్చలవిడిగా అసభ్యకరమైన పోస్టింగులు పెడుతున్నారని ఆయన అన్నారు.

దీనికి ఎక్కడో ఒక చోట అడ్డుకట్ట పడాలని అది ఏపీ అసెంబ్లీ నుంచే మొదలు కావాలని పవన్ గట్టిగా కోరారు. ఈ రోజుల సామాజిక విప్లవం బాగా అధికమైనదని అయితే అది చెడు ప్రభావానికి దారి తీయరాదు అని పవన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చేఅనుచితమైన పోస్టింగును కట్టడి చేసేలా పదునైన చట్టం రావాలని ఆయన గట్టిగానే కోరారు

అయితే దీని మీద ఏపీ సమాజం మొత్తం మీద మంచి స్పందన ఆయనకు లభించింది. పవన్ మాట్లాడింది ఆయన కోరుకుంటున్నది నూరు శాతం కరెక్ట్ అని అంతా అంటున్నారు. సోషల్ మీడియా పోస్టింగులు దారుణంగా ఉంటున్నాయని సమాజంలో అత్యధికులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కోరుకుంటున్న విధంగా కనుక బలమైన చట్టం వస్తేనే వీటికి పూర్తి స్థాయిలో అడ్డుకట్ట పడుతుందని అంతా అంటున్నారు

అదే టైం లో పెద్ద చిన్నా చూడకుండా ఆడా మగ తేడా లేకుండా కనీస విచక్షణ అన్నది కోల్పోయి సామాజిక మాధ్యమాలలో అరాచకంగా పెడుతున్న పోస్టింగులతో ఎంతో మంది మానసికంగా కుంగిపోతున్న నేపధ్యం ఉందని అంతున్నారు.

పవన్ ప్రకటన తరువాత సినీ రంగం సాఫ్ట్ వేర్ రంగం నుంచి కీలకమైన ఇతర రంగాలకు చెందిన వారి మద్దతు అధికంగా వస్తోంది. పవన్ ప్రతిపాదించిన సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ అనే చట్టాన్ని చాలా తొందరగానే తీసుకురావాలని అంతా కోరుతున్నారు.

ఇక్కడ పవన్ ఈ చట్టం గురించి చెబుతూ ప్రజాస్వామ్యం స్పూర్తి గురించి కూడా చెప్పారు ప్రజాస్వామ్యంలో సమ్మతి వెనక అసమ్మతి ఉంటుందని భిన్న అభిప్రాయాలు వాదనలు ఉంటాయని అదే అసలైన ప్రజాస్వామ్యమని ఆయన అంటూనే వాటిని సైతం దాటేసి ఇష్టారాజ్యంగా దారుణమైన పోస్టింగులు పెట్టడం అంటే సమాజం ఎటు పోతోంది అని అంతా అంటున్న నేపధ్యం ఉంది. ఏది ఏమైనా పవన్ స్టేట్మెంట్ కి మాత్రం అంతా జై కొడుతున్నారు. ఇలాంటి చట్టం కనుక ఏపీలో వస్తే అది దేశంలోనే మొదటిది అవుతుంది. అలా దేశానికి మారదర్శకత్వం చేసిన ఘనత ఏపీతో పాటు దానిని ప్రతిపాదించిన పవన్ కి కూడా దక్కుతుందని అంతా అంటున్నారు.

Tags:    

Similar News