పవన్ కుమారుడి హెల్త్ అప్టేట్.. పరిస్థితి ఎలా ఉందంటే?
ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు సమాచారం.;

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చేతులు, కాళ్ళకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తులకు పొగ చేరడంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు.
నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కల్యాణ్ నేరుగా ఆసుపత్రికి చేరుకుని కుమారుడిని పరామర్శించారు. వైద్యులు - అధికారులతో మాట్లాడి మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. భారత కాలమాన ప్రకారం బుధవారం ఉదయం అతన్ని అత్యవసర వార్డు నుంచి సాధారణ గదికి తరలించారు. వైద్యులు మార్క్ కోలుకుంటున్నాడని తెలిపారు. అయితే ఊపిరితిత్తులకు పొగ చేరడం వల్ల తలెత్తే ఆరోగ్యపరమైన సమస్యలపై మరికొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆసుపత్రి వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్క్ శంకర్ మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. ఈ సమయంలో అతనికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చేలా చూసుకుంటారు.
పవన్ కల్యాణ్ తన కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అభిమానులు - శ్రేయోభిలాషులు ప్రార్థనలు చేయాలని కోరారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మనమూ ఆశిద్దాం.
సింగపూర్‌లోని ఒక వంట పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటన రివర్ వ్యాలీ రోడ్డులో ఉన్న ఒక షాప్‌హౌస్‌లో జరిగింది. షాప్‌హౌస్ యొక్క రెండు , మూడు అంతస్తులలో మంటలు వ్యాపించాయి. ఈ షాప్‌హౌస్ ప్రాంగణంలోనే "టమోటో కుకింగ్ స్కూల్" అనే వంటల పాఠశాల ఉంది.సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఎస్‌సీడీఎఫ్) తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం 9.45 గంటలకు 278 రివర్ వ్యాలీ రోడ్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది మూడు వాటర్ జెట్‌లను ఉపయోగించి దాదాపు 30 నిమిషాల్లో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా ప్రభావిత షాప్‌హౌస్‌తో పాటు సమీపంలోని ప్రాంతాల నుండి దాదాపు 80 మందిని సురక్షితంగా ఖాళీ చేయించారు. ప్రమాదం నుండి చిన్నారులను రక్షించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని తన పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లినట్లు సమాచారం. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు మూడు రోజుల తర్వాత పవన్ తన కుమారుడితో కలిసి భారత్ కు తిరిగి రానున్నారు.