మొగల్తూరు అంటున్న పవన్

చిరంజీవిని సినిమాల్లో కీర్తించేటపుడు మొగల్తూరు మొనగాడు అని అంటూంటారు.;

Update: 2025-03-26 12:31 GMT
Pawan step towards development

మొగల్తూరు కి మెగా ఫ్యామిలీకి ఎంతో అనుబంధం ఉంది. మెగా ఫ్యామిలీ పూర్వీకులు అంతా అక్కడే ఉండేవారు. మెగా ఫ్యామిలీ అంటే కేరాఫ్ మొగల్తూరు అనే చెప్పుకుంటారు. చిరంజీవిని సినిమాల్లో కీర్తించేటపుడు మొగల్తూరు మొనగాడు అని అంటూంటారు.

ఇపుడు ఆ మొగల్తూరుకు మళ్ళీ ప్రాముఖ్యం వస్తోంది. మెగా ఫ్యామిలీలో కీలకంగా ఉన్న పవర్ స్టార్, ఉప ముఖ్యమంత్రి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొగల్తూరు కి వెళ్తున్నారు. ఆయన శుక్రవారం ఉప ముఖ్యమంత్రి హోదాలో మొగల్తూరులో అధికారిక కార్యక్రమాలను పెట్టుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం మొగల్తూరులో సాయంత్రం పెనుగొండలో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాలలోని అన్ని శాఖల అధికరులతో ఆయన సమావేశం అవుతారు. గ్రామాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి చర్చిస్తారు. ఆయా పనులు జరిగేలా ఆయన అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తారు అని అంటున్నారు.

మొగల్తూరు మెగా ఫ్యామిలీకి సొంత వూరు. అందువల్ల సొంత ఊరికి గట్టి మేలు తలపెట్టడానికి పవన్ ఈ పర్యటన పెట్టుకున్నారు అని అంటున్నారు. మొగల్తూరుని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ సంకల్పిస్తున్నారని అంటున్నారు.

రాజకీయాల్లో ఉన్న వారికి సొంత ఊరు ప్రాంతం అన్నది కచ్చితంగా ఉండాలి. అలా చూస్తే కనుక భవిష్యత్తు ఆలోచనలతోనే పవన్ కళ్యాణ్ తమ పూర్వీకుల ఊరు అయిన మొగల్తూరుని ప్రగతిపధంలో నడిపించాలని చూస్తున్నారు అని అంటున్నారు. మొగల్తూరుని రోల్ మోడల్ గా డెవలప్ చేయడం ద్వారా పవన్ అక్కడ తమ మార్క్ ని చూపిస్తారు అని అంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ ఇటీవలనే కర్నూలు జిల్లాలో జరిగిన కార్యక్రమంలో గ్రామాలలో పర్యటిస్తాను అని చెప్పారు. ప్రతీ నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఉంటాను అక్కడ సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దానికి తగినట్లుగా ఆయన ఇపుడు వస్తూనే మొగల్తూరు నుంచే శుభారంభం పలుకుతున్నారని అంటున్నారు.

ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ అంటే గుర్తుకు వచ్చే మొగల్తూరుని విశేష అభివృద్ధిని చేయాలనుకోవడం నిజంగా అభినందనీయం అని అంటున్నారు. గోదావరి జిల్లాలలో ఇప్పటికే జనసేన పట్టు సాధించింది. ఇక సొంత ఊరులో కూడా జనసేన జెండాను శాశ్వతంగా రెపరెపలు ఆడించేలా పవన్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు. మొగల్తూరులో పవన్ గ్రామ సభ మీద ఇపుడు అందరి చూపూ ఉంది. అంతతా ఆసక్తిని కూడా కనబరుస్తున్నారు.

Tags:    

Similar News