పవన్ మాత్రమే అంటున్న గిరిజనం!

ఏజెన్సీ అంటే పవన్ కి మొదటి నుంచి మక్కువ. ఆయన ఉప ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే ఎక్కువగా పర్యటించింది గిరిజన గ్రామాలలోనే.;

Update: 2025-04-08 17:30 GMT
Pawan Kalyans Powerful Bond with Tribal

ఏజెన్సీ అంటే పవన్ కి మొదటి నుంచి మక్కువ. ఆయన ఉప ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టగానే ఎక్కువగా పర్యటించింది గిరిజన గ్రామాలలోనే. ఆయన మొదట పాలకొండ పార్వతీపురం తదితర ప్రాంతాలలో పర్యటించి గిరిజనంతో కలసి తిరిగారు. వారి కష్టాలను పంచుకున్నారు. వారితో పాటే ఆయన చాలా దూరం కాలినడకన నడుస్తూ సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.

ఇక గత ఏడాది డిసెంబర్ నెలలో పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా పాడేరులో పర్యటించి రోడ్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. ఆ సమయంతోనే వారి సమస్యలను ఆయన రచ్చబండ పెట్టి మరీ విన్నారు. ఈసారి కూడా పవన్ రెండు రోజుల పాటు అరకులో పర్యటించారు. ఆయన గిరిజనంతో మమేకం అయిన తీరు అందరినీ అబ్బురపరుస్తుంది.

పవన్ పట్ల గిరిజనులు కూడా అంతే ప్రేమను కనబరుస్తున్నారు వారికి తమ బాధలను చెప్పుకోవడమే కాకుండా తమ బంధువు వచ్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ ని పిలిచి మరీ తమ ప్రాంతంలో ఉన్న ఆలయాలను ఆధ్యాత్మిక ప్రదేశాలను చూపిస్తున్నారు.

ఇదిలా ఉంటే పవన్ స్థానికంగా ఉన్న కురిడి గ్రామంలో శివాలయంలో అభిషేకం చేశారు. ఆ ఆలయం గురించి తెలుసుకున్నారు. ఆ ఆలయంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి వారు కొలువు ఉంటారు ఎంతో భక్తి ప్రపత్తులతో తాము పూజలు చేస్తామని స్థానిక గిరిజనులు పవన్ కి చెప్పారు. ఇక కురిడి గ్రామాన్ని కేరళ తరహాలో అద్భుతమైన టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.

ఇక కురిడి అన్న గ్రామాన్ని చూసి పవన్ పులకరించిపోయారు. ప్రకృతికి ఆలవాలంగా ఉందని పవన్ ఎంతోగానో సంతోషించారు. ఎన్నో పర్యాటక ప్రాంతాలు దేశంలో ఉన్నాయని వాటి సరిసాటిగా కురిడి గ్రామాన్ని కూడా తీర్చిదిద్దుతామని ఆయన ప్రకటించడం విశేషం. ఒక మోడల్ టూరిజం స్పాట్ గా దానిని డిజైన్ చేస్తామని కూడా పవన్ చెప్పారు.

ఇక స్థానిక ఆలయాలతో పాటు గ్రామ దేవతల పట్ల తమకు ఉన్న ఆరాధనా భావాన్ని గిరిజనులు పవన్ తో చెప్పారు.. దాంతో ఆయన స్పందిస్తూ గ్రామ దేవతల ఆలయాలను అభివృద్ధి చేస్తామని పవన్ చెప్పారు. ఆ ఆలయాలలో స్థానికులకే ఉపాధి అవకాశాలు ఇస్తామని ఆయన ప్రకటించారు.

మరో వైపు చూస్తే పవన్ ని చూసేందుకు పెద్దల నుంచి చిన్న వారి వరకూ అంతా అక్కడకు వచ్చారు. అవ్వలు అయితే పవన్ చేయి పట్టుకుని విడవలేదు. మరికొందరు అయితే ఆయనను ఆశీర్వదించారు. ఇంకొందరు ఆయనతో కలసి కూర్చుని మురిసిపోయారు.

పవన్ సైతం వచ్చిన వారిని అందరినీ నిరాశ పరచకుండా తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు వారి గురించి తెలుసుకుని ప్రభుత్వం ఉంది మీకు కష్టాలు రాకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. మొత్తానికి చూస్తే పవన్ కోసం గిరిజనం మొత్తం తరలివస్తే పవన్ కూడా గిరిజనం కోసం తాను అన్నట్లుగా వ్యవహరించారు. ఇక చూస్తే ఇటీవల కాలంలో ఏ మంత్రి కానీ కీలక నేతలు కానీ అరకు లో బస చేసిన దాఖలాలు లేవు

కానీ పవన్ మాత్రం ఉప ముఖ్యమంత్రి హోదాలో అరకు గెస్ట్ హౌస్ లో ఒక రాత్రి బస చేశారు. ఆ ప్రాంతం మావోయిస్టులకు అడ్డాగా ఉందని ఎవరూ అక్కడ పెద్దగా సమయం గడపరు. కానీ పవన్ మాత్రం రెండు రోజుల పాటు ఏజెన్సీలో ఉండడంతో పాటు గిరిజనంతో తానూ ఒకడిగా తిరగడంతో తాము అతి దగ్గరగా చూసిన ప్రభుత్వ పెద్ద పవన్ ఒక్కరే అని గిరిజనులు అంటున్నారు. ఈ టూర్ తరువాత ఒక విధంగా పవన్ గిరిజనంతో అతి పెద్ద బంధమే పెనవేసుకున్నారు అని చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News