పవన్ కీలక డెసిషన్ వెనక ?
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు విజయవాడలో అద్భుతంగా తీర్చిదిద్దిన క్యాంప్ ఆఫీసుని వద్దు అనుకున్నారు.
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు విజయవాడలో అద్భుతంగా తీర్చిదిద్దిన క్యాంప్ ఆఫీసుని వద్దు అనుకున్నారు. దాని కోసం ఎనభై లక్షల దాకా ఖర్చు చేసింది కూటమి ప్రభుత్వం. అలా సకల హంగులతో ఆధునీకరించింది. అలాంటి సువిశాలమైన క్యాంప్ ఆఫీసుని, హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉన్న దానిని వదులుకున్నారు పవన్ అంటే ఆయన నిర్ణయం వెనక కారణాలు ఏమిటి అన్న చర్చ సాగుతోంది.
పవన్ తీరు చూస్తే ఉప ముఖ్యమంత్రిగా చాలా పరిమితులను విధించుకుని మరీ పని చేస్తున్నారు. అది ఆయనకు ఆయనే పెట్టుకున్నట్లుగా కూడా ఉంది అని అంటున్నారు. ఆయన తన శాఖ తన పని అన్నట్లుగానే ఉంటున్నారు.
ఆయన పిఠాపురం లో వరద బాధితులను పరామర్శించారు, అక్కడ వరద నష్టం గురించి స్వయంగా వెళ్ళి తెలుసుకున్నారు. అదే సమయంలో ఆయన బెజవాడకు వరదలు వస్తే పర్యటించలేదు అన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా సరే పవన్ కి పిఠాపురం సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడికి ఇక ప్రజా ప్రతినిధిగా బాధ్యత వెళ్లారు అని అంటున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అన్ని చోట్లా పర్యటిస్తున్నారు. దాంతో పవన్ తన పని ఏమిటో అన్నట్లుగానే ఉన్నారని అంటున్నారు. ఇపుడు చూస్తే ఆయన ప్రభుత్వం కేటాయించిన క్యాంప్ ఆఫీసుని కూడా కాదనుకుని తాను సొంతంగా మంగళగిరిలో నిర్మించుకున్న క్యాంప్ ఆఫీసులోనే సమీక్షలు చేస్తున్నారు.
దీని మీదనే కూటమిలో చర్చ సాగుతోంది. పవన్ నిర్ణయం వెనక కారణాలు ఏమై ఉంటాయి అని కూడా ఆలోచిస్తున్నారు అంటున్నారు. నిజానికి చూస్తే ప్రభుత్వ పరంగా దుబారా వద్దు అనే పవన్ అనుకుంటున్నారు. అలా ఆలోచించిన మీదటనే ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు అని అంటున్నారు.
ఒక విధంగా చూస్తే ఇది మంచి నిర్ణయమే. ప్రభుత్వం ఆ భవనాన్ని వేరే విధంగా వాడుకోవచ్చు. అలా సర్కార్ కి ఆయన ఆదా చేశారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మీద భిన్నమైన చర్చ కూడా సాగుతోనంది.
పవన్ ఈ భవనం అప్పగించడం కూటమిలో కీలక మిత్ర పక్షంగా ఉన్న జనసేన తీరు పంధా మీద కూడా బయట వేరే రకంగా ఆలోచించేందుకు ఆస్కారం ఇస్తుందని అంటున్నారు. ఉన్నట్టుండి ఆ భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించడం ఆసక్తికరంగా మారింది. ఈ భవనానికి వాస్తుపరమైన ఇబ్బందులు ఉన్నాయా అనే చర్చ జరుగుతోంది.
ఏది ఏమైనా ఉప ముఖ్యమంత్రిగా పవన్ తన బాధ్యతలను తానుగా నిర్వర్తిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన సైలెంట్ గానే ఉంటూ ప్రభుత్వంలో తన పాత్రను ఎంత మేరకు అంటే అంత మేరకే అన్నట్లుగా ఉంటున్నారు అని కూడా చెబుతున్నారు. మొత్తం మీద పవన్ నిర్ణయం మాత్రం రకరకాలైన ఊహాగానాలకు తెర తీస్తోంది.