ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ఇప్పుడు పవన్ క్యాంప్ కార్యాలయం
గతంలో ఈ భవనాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరుల మంత్రిగా ఉన్న దేవినేని ఉమకు కేటాయించారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా.. ఏపీ రాష్ట్ర మంత్రిగా ఆయనకు సీఎం పేషీలోని రెండో అంతస్తులో కార్యాలయాన్ని కేటాయించటం తెలిసిందే. తాజాగా ఆయన క్యాంప్ కార్యాలయంగా ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్టుహౌస్ ను కేటాయించారు. గతంలో ఈ భవనాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వంలో జలవనరుల మంత్రిగా ఉన్న దేవినేని ఉమకు కేటాయించారు. అప్పట్లో ఆయన దీన్ని నిర్మించారు.
గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ భవనాన్ని కేటాయించారు. అయితే.. గతంలో పంచాయితీరాజ్.. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పేషీ ఐదో బ్లాక్ లో ఉండేది. దాన్ని రెండో బ్లాక్ కు మార్చటం తెలిసిందే. పవన్ తో పాటు ఆయన పార్టీకి చెందిన ఇతర మంత్రులు (నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్)లకు సైతం రెండో బ్లాక్ లోని మొదటి అంతస్తులో గదులను కేటాయించారు. ఈ బ్లాక్ లో గ్రౌండ్ ఫ్లోర్ పేషీని మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎం పేషీ ఒకటో బ్లాక్ వద్ద ఉండటం.. పవన్ పేషీ రెండో బ్లాక్ లో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయాన్ని వేరుగా ఏర్పాటు చేయటం..సదరు భవనం విశాలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అందరికి అందుబాటులో ఉండేందుకు వీలుగా క్యాంప్ కార్యాలయం ఉంటుంది. దీనికి తోడు.. కీలకమైన రివ్యూలకు వీలుగా సదరు భవనం ఉంటుందని చెబుతున్నారు.