గమనించారా...పవన్ చుట్టూ వారున్నారు...!
జనసేన అధినేత పవన్ క్రేజీ పొలిటీషియన్. ఆయన సినిమా హీరోగా పీక్ స్టేజ్ లో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు.
జనసేన అధినేత పవన్ క్రేజీ పొలిటీషియన్. ఆయన సినిమా హీరోగా పీక్ స్టేజ్ లో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. ఈ రోజుకీ ఆయన సినిమాలు చేస్తున్నారు. దాంతో పవన్ సినీ ఇమేజ్ ఆయనకు పెట్టని కోటగా ఉంది. అలాగే పవన్ కి బలమైన సామాజిక వర్గం అండగా ఉంది. ఈ నేపధ్యంలో మిగిలిన రాజకీయ నాయకులకు భిన్నంగా కనిపిస్తారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు కేరింతలు కనిపిస్తాయి.
ఆయన అడుగు తీసి అడుగు వేయాలంటే కష్టతరంగా మారుతోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇపుడు బిజీగా పర్యటనలు చేస్తున్నారు. ఆయన వరసగా విశాఖ గోదావరి జిల్లాల టూర్లు పెట్టుకున్నారు. ఈ టూర్లలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. పవన్ చుట్టూ భద్రతా వలయం కనిపిస్తోంది.
రాజమండ్రి ఎయిర్ పోర్టులో పవన్ దిగగానే ఆయనకు అటూ ఇటూ సీఆర్పీఎఫ్ భద్రతా దళాలు కనిపించారు. గతంలో పవన్ చుట్టూ వారు లేరు. ఇపుడు కొత్తగా కనిపించారు అంటే పవన్ కి భద్రత పెరిగింది అని అంటున్నారు. సీఆర్పీఎఫ్ పోలీసులు అంటే కేంద్ర సిబ్బందిగా ఉంటారు. పవన్ కి రాష్ట్ర పోలీసుల భద్రత ఒక నాయకుడిగా ఎపుడూ ఉంటుంది. దానికి ఇపుడు సీఆర్పీఎఫ్ దళాలు అదనం అన్న మాట.
ఈ భద్రతతోనే ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్తారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది అని అంటున్నారు. ఎన్నికలలో తిరిగి ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుంది.
దాంతోనే పవన్ కి భద్రత పెరిగింది అని అంటున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పవన్ కి మిత్రుత్వం ఉంది. అందుకే పవన్ భద్రత మీద కేంద్రం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. అదే విధంగా కీలక నేతల భద్రత విషయం కూడా ఇంపార్టెంట్ కాబట్టి తగిన చర్యలు తీసుకున్నారు అని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఏపీలో సీఎం జగన్ కి స్పెషల్ సెక్యూరిటీ ఉంది. అలాగే చంద్రబాబు పూర్తిగా భద్రతా వలయంలో ఉంటారు. పవన్ కి కూడా తగిన స్థాయిలో భద్రత అవసరం అని ప్రభుత్వాలు గురించాయని అందుకే ఈ విధంగా ఆయన చుట్టూ సీఆర్పీఎఫ్ దళాలు కనిపిస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పవన్ పర్సనల్ సెక్యూరిటీ ఉంటూనే ఉంటుంది. దాంతో ఏది ఏమైనా గతంలో మాదిరిగా పవన్ వద్దకు ఎవరూ వెళ్ళేందుకు వీలు ఉండదు అని అంటున్నారు.